Shubman Gill : మరి కొద్ది రోజుల్లో టీం ఇండియా వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించింది మేనేజ్మెంట్. ఇందులో గిల్ మీద వేటు వేసింది. ఉప సారథిగా ఉన్న గిల్ జట్టులో చోటు కోల్పోయాడు. అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని ఎంపిక చేయకపోవడం ఒకరకంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే కొంతకాలంగా సరైన ఫామ్ లేక పోయినప్పటికీ జట్టు లో స్థానం దక్కించుకుంటున్నాడు. అక్షర్ పటేల్ నుంచి కూడా ఉపసారథి బాధ్యతను కూడా స్వీకరించాడు. కానీ ఇప్పుడు ఉపసారధి బాధ్యత మాత్రమే కాదు, జట్టులో స్థానాన్ని కూడా కోల్పోయాడు.
గిల్ ప్రస్తుతం జట్టుకు ఉపసారధిగా ఉన్నాడు. అతడు జట్టులో లేకపోవడం షాకింగ్ నిర్ణయమని సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్లు అంటున్నారు.. వాస్తవానికి గిల్ ను పక్కన పెట్టడం వెనక అద్భుతాలు ఏమీ జరగలేదు. ఫామ్ మాత్రమే కాకుండా, ఇంకా అనేక రకాల విషయాలను లోతుగా పరిశీలించిన తర్వాత సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
రోహిత్, విరాట్ టి20 నుంచి వెళ్లిపోయిన తర్వాత. టెస్ట్ ఫార్మేట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత గిల్, జైస్వాల్ ఓపెనర్లు అవుతారని.. అన్ని విభాగాల్లోనూ వారిద్దరే ఆడతారని అందరూ అనుకున్నారు.. టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్స్, డబ్ల్యూటీసి ఫైనల్ వంటి వాటి వల్ల వారిద్దరు కేవలం టెస్ట్ మ్యాచ్ లకే పర్మిత కావలసి వచ్చింది. ఇట్ట ఇదే సమయంలో యంగ్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ జట్టులో అద్భుతాలు సృష్టించడం మొదలుపెట్టారు. దొరికిన అవకాశాలను ఏమాత్రం వదలకుండా పరుగుల వరద పారించడం మొదలుపెట్టారు.
ఆసియా కప్ నుంచి మొదలు పెడితే సౌత్ఆఫ్రికా సిరీస్ వరకు గిల్ దాదాపు 15 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో గౌతమ్ గంభీర్ ఎన్ని జాకీలు పెట్టి లేపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఫలితంగా గిల్ స్థానం అడ్రస్ లేకుండా పోయింది. వాస్తవానికి గిల్ జట్టులో ఉంటే.. పెద్దగా ప్రయోజనాలు లభించలేదు. ఎందుకంటే కేవలం అతడి కోసం సంజు శాంసన్ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి వచ్చింది. ఇలాంటి క్రమంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సరైనదని మెజారిటీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.