spot_img
Homeక్రీడలుక్రికెట్‌Team India T20 World Cup 2026 Top Performers Stats: టీ 20 వరల్డ్...

Team India T20 World Cup 2026 Top Performers Stats: టీ 20 వరల్డ్ కప్ లో టీమిండియా తోపు.. మరి ప్లేయర్లు ఎవరో తెలుసా?

Team India T20 World Cup 2026 Top Performers Stats: టి20 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. తద్వారా వరుసగా రెండవసారి.. మొత్తంగా మూడవసారి టి20 వరల్డ్ కప్ అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.

Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి

టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తోపు జట్టు. అందులో అనుమానం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల మీద భారత్ సాగించిన జైత్రయాత్ర మామూలుది కాదు. మిగతా మ్యాచ్లలో టీమిండియా తన స్థాయికి తగ్గట్టు ఆడలేదని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో టి20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టాపర్లు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

టీమిండియా ఏస్ బౌలర్ బుమ్రా 8 మ్యాచ్లలో 14 వికెట్లు తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో అయితే నాలుగు వికెట్లు పడగొట్టాడు. తద్వారా హైయెస్ట్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు.

వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో తన స్థాయి ఏమిటో నిరూపించుకున్నాడు సంజు శాంసన్. చివరికి ఫైనల్ మ్యాచ్లో కూడా దుమ్ము రేపాడు. ఈ టోర్నీలో సంజు శాంసన్ ఐదు మ్యాచ్లలో 24 సిక్సర్లు కొట్టాడు. అంటే ప్రతి మ్యాచ్లో నాలుగు కి మించి సిక్సర్లు కొట్టాడని అర్థం.

టి20 వరల్డ్ కప్ లో టీమిండియా అత్యుత్తమ గెలుపు శాతాన్ని నమోదు చేసింది. మొత్తంగా తొమ్మిది మ్యాచ్లలో 8 విజయాలు సాధించింది. గెలుపు శాతాన్ని 88.9 గా నమోదు చేసింది.

ఉత్తమ స్ట్రైక్రెట్ సాధించిన ఆటగాడిగా న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ నిలిచాడు ఇతడు 100+ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 200 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు.

పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ఏడు మ్యాచ్లలో 37 ఫోర్ లు కొట్టాడు. అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా ఇతడు రికార్డు సృష్టించాడు.

కెనడా ప్లేయర్ యువరాజ్ సమ్రా అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 110 పరుగులు (ఒక ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్) చేసిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు.

న్యూజిలాండ్ ఓపెనర్ టీం సీఫర్డ్ తొమ్మిది మ్యాచ్లలో నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. హైయెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఇతడు నిలిచాడు.

న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 33 బంతుల్లోనే సెంచరీ చేశాడు. టి20 వరల్డ్ కప్ చరిత్రలో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా ఇతడు రికార్డు సృష్టించాడు.

పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతడు ఏడు మ్యాచ్లలో 383 పరుగులు చేశాడు.

ఈ టోర్నీలో ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్ గా జోప్రా ఆర్చర్ నిలిచాడు. ఇతడు ఏకంగా 86 డాట్ బాల్స్ వేయడం విశేషం.

జింబాబ్వే ఓపెన్ బ్రియాన్ బెన్నెట్ అత్యుత్తమ బ్యాటింగ్ సగటు నమోదు చేశాడు. సూపర్ 8 దశ వరకు ఈసారి జింబాబ్వే చేరుకుంది. జింబాబ్వే సాధించిన విజయాలలో బెన్నెట్ కీలక పాత్ర పోషించాడు. ఇతడి ఉత్తమ బ్యాటింగ్ సగటు 146.

ఈ టోర్నీలో అత్యంత భారీ విజయం న్యూజిలాండ్ జట్టు సాధించింది. యూఏఈ తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు 175 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేదించింది.

పరుగులపరంగా అత్యంత భారీ విజయాన్ని జింబాబ్వే మీద వెస్టిండీస్ సాధించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఆరు వికెట్లు నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో గెలిచింది.

ఈ టోర్నీలో ఎక్కువ క్యాచ్లు పట్టిన ఆటగాడిగా న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ నిలిచాడు. ఇతడు ఏకంగా 11 క్యాచ్లు పట్టాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper