Surya Kumar Yadav
Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు 19 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 16 విజయాలు సాధించింది. ఈ విజయాలలో సూర్యకుమార్ యాదవ్ పాత్ర దాదాపు శూన్యం. గత 12 మ్యాచ్లలో సూర్య కుమార్ యాదవ్ కేవలం 242 పరుగులు మాత్రమే చేశాడు.. సూర్య కుమార్ యాదవ్ స్థాయితో పోల్చి చూస్తే ఈ పరుగులు ఏమంతా లెక్కలోవి కావు. సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ స్టామినా అద్భుతంగా ఉంటుంది. అతడు ఏమాత్రం భయం లేకుండా ఆడే తీరు.. అమోఘంగా ఉంటుంది. కానీ సూర్య కుమార్ యాదవ్ తన స్థాయికి తగ్గట్టుగా ఆటం లేదు. 2024లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ కెప్టెన్ గా వైదొలిగాడు. ఆ సమయంలో సూర్య కుమార్ యాదవ్ కు జట్టు పగ్గాలు దక్కాయి. కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ 12 మ్యాచ్ లు ఆడాడు. అయితే తన 360 డిగ్రీల యాక్షన్ ను ఎప్పుడూ చూపించలేదు. గత 12 ఇన్నింగ్స్ లలో సూర్య కుమార్ యాదవ్ 24.50 సగటును మాత్రమే నమోదు చేశాడు. ఈ ప్రకారం చూసుకుంటే గత 12 ఇన్నింగ్స్ లలో అతడు 242 రన్స్ మాత్రమే చేశాడు. 2022లో 1164, 2023లో 17 ఇన్నింగ్స్ లలో 773 పరుగులను సూర్యకుమార్ యాదవ్ చేశాడు. అయితే కెప్టెన్ గా 12 ఇన్నింగ్స్ లు ఆడిన అతడు 250 పరుగులు కూడా పూర్తి చేయలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న ప్రస్తుత టి20 సిరీస్ లో కోల్ కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో అతడు 0 పరుగులకే అవుట్ అయ్యాడు. చెన్నై వేదికగా జరిగిన రెండవ మ్యాచ్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ ఇలా ఆడటాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..
ఒత్తిడి పెరగడం వల్లే..
సూర్య కుమార్ యాదవ్ ఫామ్ అంతకంతకు దిగజారిపోవడానికి ప్రధాన కారణం అతనిపై పెరిగిన ఒత్తిడేనని అభిమానులు అంచనా వేస్తున్నారు. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. భారత జట్టుకు నాయకత్వం వహించే ఒత్తిడి అతడి పై పెరిగిపోయిందని అభిమానులు పేర్కొంటున్నారు. అందువల్లే అతడు పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్లలో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. మిగతా మూడు మ్యాచ్లలో నైనా తన పూర్వపు లయను అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ” అతడు మైదానంలో బంతిని నలుమూలల పరుగులు పెట్టించగల సామర్థ్యం ఉన్నవాడు. 360 డిగ్రీలలోనూ బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాడు. కానీ కొంతకాలంగా విఫలం అవుతున్నాడు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. కెప్టెన్సీ ఒత్తిడి అతనిపై భారాన్ని పెంచుతోందని అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య కుమార్ యాదవ్ తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నాయకుడు అనేవాడు సమర్థవంతంగా బ్యాటింగ్ చేయకపోతే ఆ తర్వాత పరిస్థితులు దిగజారి పోతాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ చీఫ్ అజిత్ అగార్కర్ వల్ల సూర్య కుమార్ యాదవ్ స్థానానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ.. భవిష్యత్తు కాలంలో ముప్పు పొంచే ఉంటుంది. దీనిని అర్థం చేసుకొని సూర్య కుమార్ కుమార్ యాదవ్ ఆడాల్సి ఉందని” అతడి అభిమానులు పేర్కొంటున్నారు.