Ravichandran Ashwin's assets
Ravichandran Ashwin : టీమ్ ఇండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. గబ్బా వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా, ఇండియా మ్యాచ్ అనంతంరం ఈ విషయాన్ని ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే అంతకు ముందు డ్రస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్‌లో మొత్తం 106 టెస్టులు ఆడగా.. 537 వికెట్లు తీశాడు. భారత్ తరపున క్రికెట్ ఆడినందుకు ఎంతో గర్వంగా ఉందని చెబుతూ.. రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. దాదాపు 14 ఏళ్ల పాటు ఇండియా తరపున అశ్విన్ మ్యాచ్‌లు ఆడాడు. ఇండియన్ క్రికెట్‌లో తనదైన ఆట శైలితో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇకపై అశ్విన్‌ను అంతర్జాతీయ క్రికెట్‌పై చూడలేమని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే అశ్విన్ కేవలం ఫ్యాన్స్ హృదయాలను మాత్రమే సంపాదించలేదు. ఆస్తులను కూడా బాగానే సంపాదించాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని ఆస్తులు విలువ ఎంత? ఏయే విలువైన వస్తువులు ఉన్నాయి? మొత్తం ఎన్ని కోట్లు ఆస్తులు సంపాదించడాని నెటిజన్లు ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. మరి అశ్విన్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
తమిళనాడులోని చెన్నైలో పుట్టిన రవిచంద్రన్ అశ్విన్ జూన్ 5వ తేదీన 2010లో క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన ఆటతో అందరినీ అలరించాడు. అయితే ప్రస్తుతానికి అశ్విన్ మొత్తం ఆస్తుల విలువ 16 మిలియన్ డాలర్లు. అంటే సుమారుగా రూ.132 కోట్లు. అశ్విన్ ఈ ఆస్తిని కేవలం క్రికెట్ ద్వారా మాత్రమే కాకుండా యాడ్స్ ద్వారా కూడా సంపాదించినట్లు తెలుస్తోంది. అశ్విన్ బీసీసీఐ నుంచి గ్రేడ్-ఎ కాంట్రాక్ట్ పొందాడు. అప్పటి నుంచి ప్రతీ ఏటా రూ.5 కోట్లు బీసీసీఐ నుంచి తీసుకుంటాడు. ఐపీఎల్‌లో కూడా రాజస్థా్న్ రాయల్స్ జట్టు తరపున అశ్విన్ ఆడుతున్నాడు. దీని నుంచి మరో రూ.5 కోట్లు తీసుకుంటున్నాడు. అయితే అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.75 కోట్లకి దక్కించుకుంది.
అశ్విన్‌కి కోట్ల ఆస్తితో పాటు విలువైన వస్తువులు కూడా ఉన్నాయి. చెన్నైలో అశ్విన్‌కి కోట్లు పలికే ఓ విలాసవంతమైన ఇళ్లు ఉంది. దీంతో పాటు రోల్స్ రైస్ కారు కూడా ఉంది. దీని విలువ దాదాపుగా ఆరు కోట్లు ఉంటుందట. అలాగే రూ.93 లక్షల ఆడి క్యూ కారులు మొత్తం 7 ఉన్నాయి. ఇలా ఎన్నో విలువైన ఆస్తులు కూడా ఉన్నాయి. అశ్విన్ కేవలం మ్యాచ్‌లు మాత్రమే కాకుండా ప్రమోషన్స్ కూడా చేస్తారు. స్పేస్ మేకర్స్, అరిస్ట్రోక్రాట్ బ్యాగ్స్, కోకో స్టూడియో తమిళ్, జూమ్ కార్, మూవ్, ఒప్పో, డ్రీమ్ 11 ఇలా ప్రకటనలు చేస్తుంటాడు. వీటి ద్వారా కూడా అశ్విన్ బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది.