https://oktelugu.com/

Heroes : 2024 టాలీవుడ్ రౌండప్: స్టార్ హీరోలకు స్వర్ణ యుగం లాంటిది..పట్టిందల్లా బంగారమే..మీడియం రేంజ్ హీరోలకు మాత్రం పీడకల!

ఒకప్పుడు మన టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సూపర్ హిట్ సినిమాలు తగలడం చాలా అరుదుగా ఉండేది. ఎక్కువ శాతం ఫ్లాపులు, తక్కువ శాతం హిట్లు ఉండేవి.

Written By:
  • Vicky
  • , Updated On : December 19, 2024 / 02:09 PM IST

    Heroes

    Follow us on

    Heroes : ఒకప్పుడు మన టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సూపర్ హిట్ సినిమాలు తగలడం చాలా అరుదుగా ఉండేది. ఎక్కువ శాతం ఫ్లాపులు, తక్కువ శాతం హిట్లు ఉండేవి. కానీ స్టార్ హీరోల సినిమాలు హిట్ అయ్యినప్పుడు మాత్రం మన టాలీవుడ్ స్థాయి పెరిగే రేంజ్ లో రీసౌండ్ వచ్చే విధంగానే ఉండేవి. ఈ ఏడాది అదే జరిగింది. 2024 వ సంవత్సరం మన స్టార్ హీరోలకు గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. స్టార్ హీరోల అభిమానులకు గూస్ బంప్స్ అనుభూతిని కలిగించిన సంవత్సరం ఇది.

    పవన్ కళ్యాణ్ :

    ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా సక్సెస్ అవ్వాలని పదేళ్ల నుండి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ అసెంబ్లీ, ఎంపీ స్థానాలు గెలిచింది. ఈ గెలుపు ప్రపంచవ్యాప్తంగా రీ సౌండ్ వచ్చింది. మూడు సార్లు ఈ దేశానికీ ప్రధాని అయిన నరేంద్ర మోడీ నోటి నుండి పార్లమెంట్ హాల్ లో ‘ఇతను పవన్ కాదు..తుఫాన్’ అని ఎలివేషన్ ఇచ్చే రేంజ్ లో విజయం సాధించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు, కేంద్రం లో NDA ప్రభుత్వం అధికారం లోకి రావడానికి కీలక కారణం అయ్యి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నాడు. ఆయన అభిమానులకు ఇది మర్చిపోలేని సంవత్సరం.

    ప్రభాస్ :

    అదే విధంగా ప్రభాస్ నటించిన కల్కి చిత్రం సంచలనం విజయం సాధించి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా డైరెక్టర్ నాగ అశ్విన్ హాలీవుడ్ సినిమాకి మా టాలీవుడ్ చిత్రం క్వాలిటీ లో ఏ మాత్రం తీసిపోదని ఈ చిత్రం ద్వారా నిరూపించాడు.

    జూనియర్ ఎన్టీఆర్ :

    జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది ‘దేవర’ చిత్రంతో ప్రభంజనం సృష్టించి 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టాడు. ఆయన అభిమానులు సుమారుగా ఆరేళ్ళ నుండి ఎన్టీఆర్ సోలో చిత్రం కోసం ఎదురు చూసినందుకు ఈ చిత్రం ఇచ్చిన అనుభూతి మామూలుది కాదు.

    అల్లు అర్జున్ :

    ఇక రెండు వారాల క్రితం విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ గురించి ప్రత్యేకించి చెప్పాలా?.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని మొదటి వారం లోనే 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది. త్వరలోనే ఈ చిత్రం 2000 కోట్ల రూపాయిల మార్కు ని కూడా అందుకోనుంది.

    మీడియం రేంజ్ హీరోలకు పీడకల:

    స్టార్ హీరోలకు ఈ ఏడాది ఇంతలా కలిసి రాగా మీడియం రేంజ్ హీరోలకు మాత్రం పీడా కలగా నిల్చింది. మాస్ మహారాజ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.ఇక వరుణ్ తేజ్ నటించిన మట్కా చిత్రం అయితే ఏ రేంజ్ డిజాస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఇక శర్వానంద్ నటించిన మనమే చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది. ఈ క్యాటగిరీ హీరోల నుండి వచ్చిన నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ మాత్రమే కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది.

    చిన్న సినిమాలకు మహర్దశ:

    ఈ ఏడాది చిన్న సినిమాలు మాత్రం దుమ్ము లేపాయి. హనుమాన్, క, లక్కీ భాస్కర్, ఆయ్, టిల్లు స్క్వేర్ , కమిటీ కుర్రాళ్ళు ఇలా ఎన్నో చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని రేంజ్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ కి కాసుల కనకవర్షం కురిపించాయి.

    అనువాద చిత్రాల పరిస్థితి ఏమిటంటే:

    కానీ అనువాద చిత్రాలు భారతీయుడు 2 , కంగువా, వెట్టియాన్, గోట్ వంటివి ఘోరమైన ఫ్లాప్స్ గా నిలబడగా..సత్యం సుందరం, అమరన్ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. రజినీకాంత్ వెట్టియాన్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయింది. అమరన్ చిత్రం మాత్రం సైలెంట్ గా వచ్చి తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ ని సృష్టించింది.