Asia Cup Final: ఏషియా కప్ చివరి దశ కి చేరుకున్న సందర్భంగా ఇండియా శ్రీలంక ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి ఎనిమిదవ సారి ఏషియా కప్ ని సాధిస్తుంది అనే నమ్మకంతో యావత్ ఇండియా అభిమానులు అందరూ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలంటే మన బ్యాట్స్ మెన్స్ అయినారోహిత్ శర్మ,శుభమాన్ గిల్ , కోహ్లీ ,ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా లలో ఎవరైనా ఇద్దరు లేదా ముగ్గురు ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే గాని ఈ మ్యాచ్ లో మనవాళ్లు గెలవలేరు. అందుకే వాళ్ళని ఎదుర్కోవాలంటే ముందే మనవాళ్ళు చాలా ఫ్రీ ప్లాన్డ్ గా మ్యాచ్ మొత్తాన్ని ముందే డిజైన్ చేసుకొని రంగంలోకి దిగాలి. ఈ చిన్న పొరపాటు చేసినా కూడా శ్రీలంక స్పిన్నర్ల చేతిలో మనవాళ్లు అవుట్ అవ్వక తప్పదు.
మొన్న జరిగిన మ్యాచ్ లో శ్రీలంక బౌలర్ అయిన వెల్లలాగే బౌలింగ్ లో వరుసగా స్టార్ బ్యాట్స్ మెన్స్ అవుట్ అవ్వడం చూస్తుంటే మనకు అర్థం అవుతుంది ఒక స్పిన్ బౌలర్ ని ఎదుర్కోవడంలో మనవాళ్లు ఎలా ఇబ్బంది పడుతున్నారని కానీ ఈ మ్యాచ్ లో మనవాళ్ళు బ్యాటింగ్ బాగా చేయగలిగితే ఈ మ్యాచ్ ఈజీగా గెలవచ్చు అలాగే మొదట బ్యాటింగ్ తీసుకున్నట్లయితే 300 పైన స్కోర్ చేయాలి లేదా శ్రీలంక వాళ్ళు మొదట బ్యాటింగ్ తీసుకున్నట్లయితే వాళ్లను 250 లోపు కట్టడి చేసే విధంగా బౌలింగ్ చేయాలి అలా అయితేనే మనవాళ్ళు ఈజీగా ఈ మ్యాచ్ గెలవగలగుతారు.అయితే శ్రీలంక చిన్న టీం కదా అని ఎంత మాత్రం తక్కువ అంచనా చేయకూడదు. ఒకవేళ తక్కువ అంచనా వేసినట్లయితే అది మన టీం కి భారీ దెబ్బ అవుతుంది ఎందుకంటే శ్రీలంక లాంటి ఒక టీమ్ పాకిస్తాన్ లాంటి చాలా స్ట్రాంగ్ టీమ్ ని ఓడించింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు శ్రీలంక ఎంత పటిష్టంగా ఉందో… ఇక ఈ మ్యాచ్ లో మనవాళ్లు గెలవాలంటే ముందుగా వెల్లలాగే బౌలింగ్ ని చాలా ధీటుగా ఎదుర్కోవాలి అలాగే వాళ్ళ బ్యాట్స్ మెన్స్ లలో సదిరా, కుషల్ మేండీస్,అసలంక లాంటి బ్యాట్స్ మెన్స్ ను చాలా తొందరగా అవుట్ చేయాలి వీళ్ళ ముగ్గురిని కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవుట్ చేస్తే మ్యాచ్ ఇండియా చేతిలోకి వస్తుంది…