India Vs Bangladesh Asia Cup: కలకలం : ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందా?

నిజానికి ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ చేస్తే ఇండియా కి ఏం వస్తుంది.ఏం రాదు అయితే ఇండియా టీం కోచ్, కెప్టెన్ ఇద్దరు కలిసి ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా పెద్దగా పోయేది ఏం లేదు కాబట్టి ఇండియన్ స్క్వాడ్ లో ఉండి ఆడకుండా ఉంటున్న మిగితా ప్లేయర్లకి ఈమ్యాచ్ లో అవకాశం ఇవ్వాలని బెంచ్ కె పరిమితమైన ప్లేయర్ల ని ఈ మ్యాచ్ లో ఆడించడం జరిగింది.

Written By: Gopi, Updated On : September 16, 2023 12:43 pm

India Vs Bangladesh Asia Cup

Follow us on

India Vs Bangladesh Asia Cup: ఏషియా కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇండియా మీద ఆరు పరుగుల తేడా తో బాంగ్లాదేశ్ విజయం సాధించింది.మన ప్లేయర్లు చివరి వరకు పోరాడిన కూడా ఫలితం మాత్రం దక్కలేదు అయితే ఈ మ్యాచ్ లో గిల్ ఒక అద్భుతమైన సెంచరీ సాధించిన కూడా మిగిలిన వాళ్ళు అందరు ఫెయిల్ అవడం తో ఇండియా ఈ మ్యాచ్ లో ఓడిపోవాల్సి వచ్చింది.ఇక ఈ మ్యాచ్ లో గెలవడం తో ఇండియా లాంటి పెద్ద జట్టు ని ఓడించినందుకు బంగ్లాదేశ్ టీం మెంబర్స్ కానీ ఆ దేశపు జనాలు కానీ చాలా సంబరాలు జరుపుకుంటున్నారు.నిజానికి కొంచం బాగా ఆడితే ఇండియా ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదు.ఇక దీన్ని అదును గా తీసుకొని కొంత మంది ఈ మ్యాచ్ లో ఇండియాన్ ప్లేయర్లు ఫిక్సింగ్ చేసారు అంటూ చాలా రకాలైన కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ చేస్తే ఇండియా కి ఏం వస్తుంది.ఏం రాదు అయితే ఇండియా టీం కోచ్, కెప్టెన్ ఇద్దరు కలిసి ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా పెద్దగా పోయేది ఏం లేదు కాబట్టి ఇండియన్ స్క్వాడ్ లో ఉండి ఆడకుండా ఉంటున్న మిగితా ప్లేయర్లకి ఈమ్యాచ్ లో అవకాశం ఇవ్వాలని బెంచ్ కె పరిమితమైన ప్లేయర్ల ని ఈ మ్యాచ్ లో ఆడించడం జరిగింది.అందుకే విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, బుమ్రా లకి ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళ ప్లేస్ లో తిలక్ వర్మ,సూర్య కుమార్ యాదవ్,అక్షర్ పటేల్,ప్రసిద్ధి కృష్ణ లు ఆడటం జరిగింది…అయితే వీళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చారు అంటే ఏషియా కప్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్ ఉంది.ఇక వీళ్ళందరూ వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్నారు కాబట్టి ఎవరు ఎలా ఆడుతున్నారో తెలియాలంటే వాళ్ళకి ప్రాక్టీస్ కోసమైనా ఈ మ్యాచ్ ఆడించడం జరిగింది.

అయితే ఈ మ్యాచ్ లో వాళ్ళందరూ వరుసగా ఫెయిల్ అయ్యారు.అందుకే ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడం జరిగింది అంతే తప్ప ఫిక్సింగ్ చేయాల్సిన అవసరం ఇండియా కి లేదు.ఇక టాప్ ప్లేయర్లు ఆడకపోవడం వల్ల యంగ్ ప్లేయర్లు తడపడటం వల్లనే ఇలా జరిగింది తప్ప అంతకు మించి ఇంకా అక్కడ ఏమి జరగలేదు. ఇక ఈమ్యాచ్ విషయం పక్కన పెట్టి ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది…