Hardik Pandya: భారత జట్టు 2013లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. నాడు భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) నాయకత్వం వహించాడు.. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టుకు రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వం వహిస్తున్నాడు.. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ (Star sports) దక్కించుకుంది. ఓటేటి హక్కులను కూడా Disney Plus hotstar అందుకుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ కర్టెన్ రైజర్ కార్యక్రమాలను స్టార్ స్పోర్ట్స్ ప్రారంభించింది.. ఈ క్రమంలో ఐసిసి ఆధ్వర్యంలో ఆల్ ఆన్ ది లైన్ (all on the line) అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.. ఈ కార్యక్రమంలో టీమిండియా ఆటగాడు హార్థిక్ పాండ్యా(Hardik Pandya), ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ (phil salt), నబీ, షహీన్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ (ICC) ఇన్ స్టా గ్రామ్ (Instagram) లో షేర్ చేసింది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాడు హార్థిక్ పాండ్యా మాట్లాడాడు. పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
8 సంవత్సరాల తర్వాత..
ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ 8 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తోంది. ఇది గొప్ప పరిణామం. సమకాలిన క్రికెట్ గేమ్ కు సరికొత్త శక్తులు అందిస్తుంది. వన్డే ఫార్మాట్ కు విభిన్నమైన ఆదరణను తీసుకొస్తుంది. ఈ టోర్నీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ మెగా టోర్నీ కోసం అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్లేయర్లు ఆసక్తిగా ఉన్నారు. మా బ్రాండ్ క్రికెట్ ను కచ్చితంగా మేము చూపిస్తాం. మా ప్రత్యర్థుల ఎదుట మా సత్తాను ప్రదర్శిస్తాం.. అందుకోసం మా జట్టు ఆటగాళ్లు ఆసక్తిగా ఉన్నారని” పాండ్యా పేర్కొన్నాడు..
ఇక ఇంగ్లాండ్ ఆటగాడు సాల్ట్ కూడా తనదైన స్పందన తెలియజేశాడు. ” ఐసీసీ నిర్వహిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో విజేతగా నిలవడానికి మా జట్టు చివరి వరకు పోరాడుతుంది. జట్టు తరఫున ఆడే అవకాశం రావడానికి గొప్పగా భావిస్తున్నాను. ఇది అరుదైన గౌరవం కూడా. మా ప్రత్యర్థుల నుంచి కచ్చితంగా పోటీ ఉంటుంది. గ్రూప్ దశ నుంచి మొదలుపెడితే ఫైనల్ వరకు అత్యంత కఠినమైన సవాళ్లను మేము ఎదుర్కోవాల్సి ఉందని” సాల్ట్ పేర్కొన్నాడు. మరోవైపు తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తలపడుతోంది. ఈ క్రమంలో అత్యుత్తమ జట్లలో పోటీపడేందుకు ఎదురుచూస్తున్నానని ఆ జట్టు ఆల్రౌండర్ నబీ పేర్కొన్నాడు.. మరోవైపు పాకిస్తాన్ స్టార్ పేస్ బౌలర్ షహీన్ ఆఫ్రిది కూడా స్పందించాడు. ” ఇది మాకు లభించిన గౌరవం. మాకు దక్కిన గుర్తింపు. గత సీజన్లో ఛాంపియన్ గా నిలిచాం. ఈసారి డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్నాం. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది. వచ్చేనెల 19 కోసం మా జట్టు మాత్రమే కాకుండా మా దేశం మొత్తం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఇంతకు మించిన గొప్ప విషయం మాకు లేదని” ఆఫ్రిది పేర్కొన్నాడు