
Ravindra jadeja : ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో 5 వికెట్లతో చెలరేగి ఆస్ట్రేలియాను 200 లోపే కట్టడి చేశాడు రవీంద్ర జడేజా. చాలా రోజుల గ్యాప్ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీఇచ్చిన జడేజా అందరికంటే మెరుగ్గా రాణించాడు. బౌలింగ్ లో 5 వికెట్లు తీయడమే కాదు.. బ్యాటింగ్ లోనూ రాణించి ఆఫ్ సెంచరీ చేశాడు.
అయితే జడేజా 5 వికెట్లు కూల్చి ఆస్ట్రేలియా నడ్డి విరిచిన నేపథ్యంలో ఒక వీడియో బయటకు వచ్చింది. బౌలింగ్ చేస్తుండగా చేతికి ఏదో పూసుకున్నట్టు వీడియోలో కనిపించింది. ఇది ట్యాంపిరింగా? అని ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ అనుమానం వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సైతం ఈ వివాదంసై అగ్గిరాజేశారు. ‘జడేజా చాలా సేపు బౌలింగ్ చేశాడని.. కాబట్టి వేలికి ఏదో పూసుకున్నాడని..’ అంటూ డౌట్ వ్యక్తం చేశారు.
ఈ వివాదం పెద్దది కావడంతో రిఫరీ తాజాగా కెప్టెన్ రోహిత్ ను, జడేజాను పిలిపించి మాట్లాడారట.. అయితే జడేజా పూసుకున్నది ఆయింట్ మెంట్ అని.. వేలినొప్పి నుంచి ఉపశమనం కోసమే జడేజా ఆ అపాయింట్ మెంట్ వాడారని చెప్పినట్లు తెలుస్తోంది. మ్యాచ్ రిఫరీకి చెప్పిన తర్వాతే ఆ అపాయింట్ మెంట్ రాసుకున్నట్లు పేర్కొంటున్నారు. రిఫరీ జడేజాకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది..
అయితే ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఎంపైర్ ఎదురుగా నిలబడి జడేజా ఈ పనిచేస్తే ఇన్ని ఆరోపణలు వచ్చేవి కావు. ఇప్పుడు 5 వికెట్లు తీసుకున్నా ఆస్ట్రేలియన్లు జడేజాపై అనవసరపు ఆరోపణలతో అతడిని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
This is absolutely shocking!
Jadeja is quite clearly applying a magic potion to his finger here, which has tricked the Australian's into forgetting they can use their bats.
12 month ban. Now. #AUSvINDpic.twitter.com/dukRDR1sni
— The Cricket Podcast (@TheCricketPod) February 9, 2023