
Amigos Collections: నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..’భింబిసారా’ వంటి సంచలనాత్మక విజయం సాధించిన చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ నుండి వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ పై నందమూరి అభిమానులు ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోతాయని అనుకున్నారు..టీజర్ , ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండడం తో ట్రేడ్ వర్గాలు సైతం మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ ఉంటాయని అనుకున్నారు.కానీ అడ్వాన్స్ బుకింగ్స్ సరిగా జరగలేదు.
Also Read: Rashmi- Sudigali Sudheer: బిగ్ బాస్ సీజన్ 7లో రష్మీ-సుధీర్… కెమెరాల ముందు రియల్ రొమాన్స్?
ఇలాంటి జానర్ లో వచ్చే సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా ఉండదు, టాక్ వస్తే మ్యాట్నీస్ నుండి కలెక్షన్స్ ఊపందుకుంటాయని ట్రేడ్ వర్గాలు భావించాయి.అనుకున్నట్టే టాక్ కూడా బాగా వచ్చింది, కానీ కలెక్షన్స్ మాత్రం నిల్..’భింబిసారా’ వంటి సంచలన విజయం తర్వాత కూడా కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోవడం బాధాకరం.దీనినిబట్టీ చూస్తే ఆడియన్స్ కొత్త తరహా సినిమాలకంటే కమర్షియల్ సినిమాలకే అదిరిపొయ్యే ఓపెనింగ్స్ ఇస్తారని అర్థం అవుతుంది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు..’భింబిసారా’ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, ‘అమిగోస్’ చిత్రానికి అందులో సగం ఓపెనింగ్ కూడా వచ్చే అవకాశం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ సినిమాకి భింబిసారా మొదటి రోజు కలెక్షన్స్ ని అందుకునేందుకు మూడు రోజుల సమయం పట్టేటట్టు ఉందని అంచనా వేస్తున్నారు.అయితే ఈ సినిమాకి జరిగిన బిజినెస్ తక్కువే కాబట్టి బ్రేక్ ఈవెన్ మార్కు చాలా తేలికగా అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.కలెక్షన్స్ సంగతి కాసేపు పక్కన పెడితే ప్రేక్షకులకు ఎప్పుడూ కోతరకమైన అనుభూతి కలిగించాలని విభిన్నమైన కథలను ఎంచుకుంటున్న కళ్యాణ్ రామ్ ని మెచ్చుకొని తీరాల్సిందే.
Also Read: Amigos Movie Review: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మూవీ ఫుల్ రివ్యూ