Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson: టీమిండియా పరువు సంజు శాంసన్ చేతిలో..

Sanju Samson: టీమిండియా పరువు సంజు శాంసన్ చేతిలో..

Sanju Samson: ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఎందుకిలా అవుతుందో తెలియడం లేదు. అసలు ప్రవాహం లాగా పరుగులు సాధించే ఆటగాళ్లు ఇలా ఎందుకు అవుతున్నారో ఎంతకీ అంతు పట్టడం లేదు. ఐపీఎల్ లో సెంచరీల మీద సెంచరీలు చేసి.. పరుగుల మీద పరుగులు చేసిన ఆటగాళ్లు ఇలా ఎందుకు అవుట్ అవుతున్నారు బోధపడడం లేదు. నిజానికి భారత జట్టు ప్లేయర్లు ఇలా ఆడతారని.. ఇలా విఫలం అవుతారని ఏ అభిమాని కూడా కలలో ఊహించలేదు.

ఐరిష్ జట్టుతో సిరీస్ కోల్పోవడం.. అది కూడా వైట్ వాష్ కు గురి కావడం సగటు అభిమానిని ఆందోళనకు గురి చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టుతో ఆ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే సిరీస్ టీమ్ ఇండియాకు కోల్పోయింది. వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే చివరి మ్యాచ్ టీమ్ ఇండియాకు అత్యంత కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ లో కనుక ఓడిపోతే వరుసగా రెండు వైట్ వాష్ లకు గురైన జట్టుగా టీమిండియా చెడ్డ రికార్డు సొంతం చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి చెత్త రికార్డు నమోదు చేయకూడని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే చివరి మ్యాచ్ కు అనేక రకాల మార్పులు చేర్పులు చేయాలని బలమైన నిర్ణయంతో ఉంది.

కనీసం ఒక విజయమైనా సాధించి.. రెండు సిరీస్ ల ఓటమి తాలూకు ఒత్తిడిని జయించాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే పక్కన పెట్టిన ఓపెనర్ సంజు శాంసన్ కు మేనేజ్మెంట్ పిలుపు ఇచ్చినట్టు తెలుస్తోంది. అతడికి చివరి మ్యాచ్లో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే టి20 వరల్డ్ కప్ లో అతడు ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించుకోలేదు. కానీ మేనేజ్మెంట్ అతడికి అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకున్నాడు. టీమిండియా పొట్టి ప్రపంచ కప్ సాధించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. అయితే అతడికి ఐరిష్ సిరీస్..లో చోటు కల్పించినప్పటికీ.. రెండు మ్యాచ్లలో విఫలమయ్యాడు. దీంతో అతడిని పక్కనపెట్టి సూర్య వంశీని ఓపెనర్ గా తీసుకొచ్చారు. అతడు కూడా ఆశించిన స్థాయిలో ఆడ లేకపోవడంతో.. మళ్లీ సంజును మేనేజ్మెంట్ రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. చివరి మ్యాచ్లో అతనితోపాటు.. సూర్యాంష్ కు చోటు కల్పిస్తారని సమాచారం. సరిగ్గా ఆడలేక పోతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. వాషింగ్టన్ సుందర్ ను చివరి మ్యాచ్లో పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular