Team India Worst Record: వన్డేలలో టీమిండియాకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. టి20 లలో ఇండియాను పోల్చి చూడాల్సిన అవసరం కూడా లేదు. అదే సుదీర్ఘ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి టీమిండియా దారుణంగా తేలిపోతోంది. ఆటగాళ్లు భారీగా పరుగులు చేస్తున్నప్పటికీ.. వికెట్లు తీయడంలో బౌలర్లు దారుణంగా విఫలమవుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సిరీస్లో కొన్ని సందర్భాల్లో బ్యాటర్లు.. మరికొన్ని సందర్భాల్లో బౌలర్లు తేలిపోయారు. ఇక ఇంగ్లీషు జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో.. తొలి మ్యాచ్లో భారత బౌలర్లు దారుణంగా చేతులెత్తేశారు. గెలవాల్సిన మ్యాచ్ కాస్త ఇంగ్లాండు చేతుల్లో పెట్టి పరువు తీసుకున్నారు. గొప్ప గొప్ప బౌలర్లు ఉన్నప్పటికీ వికెట్లు తీయడంలో చతికిల పడ్డారు. గల్లి బౌలర్ల స్థాయిలో బౌలింగ్ వేసి పరువు తీసుకున్నారు. అయితే ఇటీవల ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న తర్వాత టీమ్ ఇండియా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా మరో దారుణమైన ఘనతను సొంతం చేసుకుంది.
Also Read: ఓయో రూంలకు వెళ్తున్నారా? ఎందుకైనా మంచిది ఈ వీడియో ఒకసారి చూడండి..
చివరగా టీమిండియా ఆడిన తొమ్మిది టెస్టులలో కేవలం ఒకే ఒక విజయం సాధించి జింబాబ్వే సరసన నిలిచింది. టెస్ట్ ఆడే జట్లు మొత్తం తమ చివరి తొమ్మిది మ్యాచ్లలో కనీసం రెండిట్లో అయినా విజయాలు సాధించాయి. కానీ భారత్, జింబాబ్వే జట్టు మాత్రం ఒక్కో మ్యాచ్ మాత్రమే గెలిచాయి. భారత్ తను ఆడిన చివరి 9 టెస్ట్ మ్యాచ్లలో ఏడింట్లో ఓటమిపాలైంది. ఒకదానిని డ్రా చేసుకుంది. ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. ఇక ఇటీవల డబ్ల్యూటీసీ ఛాంపియన్ గా నిలిచిన బవుమా సేన ఏకంగా తొమ్మిది మ్యాచ్లలో 8 గెలిచింది. ఈ జాబితాలో సౌత్ ఆఫ్రికా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది..
పరువు పోతోంది
విదేశంలోనే కాదు స్వదేశంలోనూ భారత జట్టు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నది. గత ఏడాది కివీస్ జట్టుతో జరిగిన మూడు టెస్టులలో భారత్ అత్యంత నాసిరకమైన ప్రదర్శన చేసింది. ఏకంగా మూడు టెస్టులలో ఓటమిపాలై పరువు తీసుకుంది. తొలిసారిగా కివిస్ చేతిలో వైట్ వాష్ కు గురైంది. తద్వారా డబ్ల్యుటిసి ఫైనల్స్ వెళ్లే అవకాశాలను సంకిష్టం చేసుకుంది. ఇక కంగారు గడ్డపై కూడా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. పైగా కంగారు జట్టు ప్లేయర్ల ముందు తలవంచింది. దీంతో ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లకుండానే భారత్ నిష్క్రమించింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లిన సఫారీలు కంగారులను ఓడించి విజేతగా నిలిచారు. బలమైన కంగారులను పడుకోబెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు.
Also Read: అతడు వచ్చాడు.. టీమిండియా కు బ్యాడ్ టైం మొదలైంది..