India Vs England 5th Test: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే నాలుగు టెస్టులు ముగిశాయి. ఇందులో 3–1తో టీమిండియా ఆధిక్యంలో ఉంది. ఐదో టెస్టు ధర్మశాలలో మార్చి 7 నుంచి 11 వరకు జరుగనుంది. ఈ మ్యాచ్ గెలుపే లక్ష్యంగా భారత జట్టు కొన్ని కీలక మార్పులు చేయనుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ర్యాంకులో మొదటి స్థానానికి చేరిన భారత జట్టు ఈ మ్యాచ్ గెలిచి ర్యాంకు మరింత పదిలం చేసుకోవాలనుకుంటోంది.
హ్యాట్రిక్ విజయాలు..
టీమిండియా హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్టు ఓడిపోయింది. తర్వాత విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ టెస్టుల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. 3–1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్ వరుస డబుల్ సెంచరీలు, బుమ్రా బౌలింగ్ కీలకంగా చెప్పుకోవచ్చు. రాజ్‌కోట్‌లో సెంచరీతో శుభ్‌మన్ గిల్ ఫామ్ అందుకోవడం, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ తొలి సిరీస్‌లోనే అదరగొట్టడం, అశ్వి¯Œ , జడేజా అటు బంతి, ఇటు బ్యాటుతో రాణించడం, కీలక సమయాల్లో రోహిత్ సెంచరీ వంటి అంశాలు భారత్‌కు సిరీస్‌ను అందించాయి. ఇప్పుడు అందరి దృష్టి కీలక ఐదో టెస్టు వైపు మళ్లింది. కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలుపే లక్ష్యంగా జట్టులో కొన్ని మార్పులు చేసే యోచనలో ఉంది.
ఈ మార్పులు ఉండొచ్చు..
చివరి టెస్టులో భారత బౌలింగ్ లైనప్‌లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రాంచి టెస్టులో విశ్రాంతి తీసుకున్న బూమ్రా ఐదో టెస్టుకు అందుబాటులో ఉంటాడు. అతనికి కచ్చితంగా ప్లేయింగ్ 11లో చోటు ఉంటుంది. దీంతో సిరాజ్ లేదా ఆకాశ్‌దీప్‌ను తప్పించే అవకాశం ఉంది. మొదటి టెస్టు ఆడిన సిరాజ్ వైజాగ్ టెస్టులో విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత రాజ్‌కోట్, రాంచీ టెస్టులు ఆడాడు. ఇక, నాలుగో టెస్టులో అవకాశం దక్కించుకున్న ఆకాశ్‌దీప్‌కు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తొలి క్యాప్ అందించాడు. మూడు వికెట్లు తీసి అదరగొట్టాడు. సాధారణంగా టీమిండియా పేస్ బౌలింగ్‌ను బూమ్రా, సిరాజ్ పంచుకుంటారు. అయితే సిరీస్ గెలిచినందున ఐదో మ్యాచ్‌లో ఆకాశ్‌కు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.
మూడో సీమర్ అవసం.
ఇక ఐదో టెస్టులో భారత్ ముగ్గురు సీమర్లను ఆడించే అవకాశం ఉంది. భారత్‌లోని ఇతర స్టేడియంలతో పోలిస్తే ధర్మశాలలో పరిస్థితులు కాస్న భిన్నంగా ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ముగ్గురు పేసర్లను తీసుకునే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే అశ్విన్, జడేజా, కుల్దీప్‌లలో ఒకరు బెంచ్‌కు పరిమితం అవుతారు. కుల్దీప్‌ను బెంచ్‌కు పరిమితం చేసే అవకావాలు ఎక్కువగా ఉన్నాయి. సీమర్లలో బూమ్రా, సిరాజ్‌తోపాటు ఆకాశ్ లేదా బెంగాల్ సీమర్ ముఖేష్‌లో ఒకరికి ఛాన్స్ దక్తుంది.
పాటిదార్ స్థానంలో పడిక్కల్..
ఇక ఐదు టెస్టుకు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన రజత్ పాటిదార్ విశాఖపట్నం టెస్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే పటిదారు కేవలం 63 పరుగులే చేశాడు. దీంతో అతడి స్థానంలో ఐదో టెస్టులో దేవదత్ పడిక్కల్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. టీ20తో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్‌కు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కొచ్చు.
తుది జట్టు అంచనా..
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, రజత్ పాటిదార్/ దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), అశ్విన్, కుల్దీప్ యాదవ్/ఆకాష్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్.