Beer
Beer: బీర్.. ఈ పేరు వినగానే యువత ఉత్సాహంగా ఉరకలేస్తుంది. ఇప్పుడు వేసవి రాబోతోంది. ఇక మందుబాబులు బీర్లు తెగ లాగించేస్తారు. వేడి నుంచి ఉపశమనం కోసం బీర్లు తాగేస్తారు. చిల్డ్ బీర్ తాగి చిల్ అవుతారు. యువత ఎక్కువగా ఇష్టపడే మందు బీర్. పండుగలు, పార్టీలు, విషాదం ఏదైనా బీర్ తాగాల్సిందే. అయితే మద్యం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ, బీర్ మాత్రం ఆరోగ్యానికి మంచిదట. బీర్ అతిగా వాడకుండా ఒక గ్లాసుతో జీవితాన్ని సులభంగా, ఆనందంగా గడపడానికి సాయపడుతుందట.
బీర్‌లో ఇవీ..
బీర్‌ను ఈస్ట్, హోప్‌లు, తృణధాన్యాలతో తయారు చేస్తారు. వాటిని పులియబెట్టడం ద్వారా బీర్ తయారు చేస్తారు. ఒక బీర్ క్యాన్‌లో ఆల్కహాల్ 4 నుంచి 6 శాతం ఉంటుంది. ఇందులో 40 శాతం పోషకాలు ఉంటాయి. ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. బీర్ మితంగా తాగితే ఆరోగ్యానికి సహాయపడుతుందని బేవరేజ్ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
గుండెకు ఆరోగ్యం..
బీర్ అనేది గుండెకు మంచిదట. బీర్ తాగనివారితో పోలిస్తే తాగేవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 42 శాతం తక్కువ ఉన్నట్లు తేలింది. అయితే బీర్‌ను మితంగా తీసుకుంటే గుండెకు ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. 5 శాతం ఆల్కహాల్ తీసుకోవడం మంచి వినియోగం అంటున్నారు.
బ్లడ్ షుగర్ నియంత్రణ..
ఇక చాలా మందికి రక్తంలో చక్కె ఓ సాధారణ సమస్య అయింది. అయితే మితమైన బీర్ తాగడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు. బీర్ డయాబెటిస్‌కు ప్రమాదకరం అయినా మితంగా తీసుకుంటే ఇన్సులిన్‌ను నియంత్రిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే చక్కెర ఉన్న బీర్లు అవాయిడ్ చేయాలని సూచిస్తున్నారు.
కిడ్నీ స్టోన్స్..
మూత్రనాళ వ్యవస్థలో అదనపు కాల్షియం నిల్వలు నిరోధించడంతో మితమైన బీర్ సహాయ పడుతుందని అంటున్నారు. ఇది అధిక మూత్ర ఉత్పత్తి మూత్ర నాళాలను విస్తరింపజేసి మూత్రపిండాలలోనిరాళ్లను నొప్పి లేకుండా ఫ్లష్ చేస్తుందట. అయితే ఒక్కడో సమస్య కూడా ఉంది. అధికంగా బీర్ తాగితే మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయి. మితంగా తీసుకోవడం మంచిది.
క్రియేటివీటి పెంపు..
ఇక బీర్ తాగితే క్రియేటివిటీ పెరుగుతుందట. కాన్షియస్ నెస్ అండ్ కాగ్నిషన్ అనే జర్నల్ చేసిన అధ్యయనంలో బీర్ తాగే పురుషులు సాధారణ పురుషులకన్నా శబ్ద పజిల్‌ను వేగంగా పరిష్కరిస్తారని తేలింది. బీర్ సమస్యల పరిష్కార నైపుణ్యాలను మెరుగు పరుస్తుందని నమ్ముతున్నారు.
ఇలా చాలా సమస్యలకు పరిష్కారం బీర్.. అయితే మితంగా తీసుకుంటేనే మంచిది. అధికం హానికరమే అని గుర్తుంచుకోవాలి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Health benefits of beer in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com