https://oktelugu.com/

Team India : టెస్ట్ క్రికెట్ లో టీమిండియా సంచలనం.. ఏకంగా ఆస్ట్రేలియా ఘనత కే ఎసరు పెట్టిన రోహిత్ సేన..

క్రికెట్ ఇంగ్లాండ్ దేశంలో పుట్టినప్పటికీ.. ఆధిపత్యం మాత్రం ఆస్ట్రేలియా జట్టుదే. అయితే దానికి చెక్ పెట్టేందుకు గత కొంతకాలంగా టీమ్ ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు ఇప్పుడు విజయవంతమైనట్టే కనిపిస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 1, 2024 / 05:47 PM IST

    Team India

    Follow us on

    Team India : కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా బంగ్లాదేశ్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా స్వదేశంలో 18 వరుస టెస్ట్ విజయాలను సొంతం చేసుకున్న జట్టుగా టీమిండియా ఆవిర్భవించింది. 2013 నుంచి 2024 వరకు టీమిండియా ఒక సిరీస్ కూడా కోల్పోలేదు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరు మీద ఉండేది. 1994 నుంచి 2000 సంవత్సరం వరకు ఆస్ట్రేలియా 10 టెస్ట్ సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. 2004 నుంచి 2008 మధ్యలోనూ వరుసగా పది టెస్టు సిరీస్ విజయాలను దక్కించుకుంది. అయితే ఆస్ట్రేలియా రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. ఏకంగా 18 టెస్టు సిరీస్ విజయాలతో హైయెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది.. ఈ ఘనతను మాత్రమే కాకుండా తక్కువ బంతుల్లో టెస్ట్ విజయాన్ని సాధించిన రికార్డును దక్కించుకుంది రోహిత్ సేన.. వాస్తవానికి కాన్పూర్ మైదానంలో రెండవ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అంచనా వేశారు. ఫలితంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ తను ఆడే తదుపరి ఎనిమిది టెస్ట్ మ్యాచ్లలో కచ్చితంగా ఐదు గెలవాలి, ఒకటి డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అలాంటి స్థితి నుంచి టీమిండియా గెలుపు బాట పట్టింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సమష్టి ప్రదర్శన ద్వారా బంగ్లాదేశ్ జట్టును కాన్పూర్ వేదికగా మట్టి కరిపించింది. ఇదే క్రమంలో టీమిండియా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బంతుల్లో టీమిండియా టెస్ట్ విజయాన్ని దక్కించుకున్న జట్టుగా నిలిచింది. కాన్పూర్ లో తక్కువ బంతుల్లోనే గెలుపును సొంతం చేసుకున్నప్పటికీ టీం ఇండియా తన సాధించిన గత రికార్డును అధిగమించలేకపోవడం విశేషం.

    వెస్టిండీస్ జట్టుకు దగ్గరలో..

    వెస్టిండీస్ తో 1935 బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఇంగ్లాండ్ జట్టు టెస్టు సిరీస్ ఆడింది. వెస్టిండీస్ విధించిన లక్ష్యాన్ని ఇంగ్లాండు కేవలం 276 బంతుల్లోనే సాధించింది. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే హైయెస్ట్ రికార్డ్ గా ఉంది. 2024లో కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత్ 281 బంతుల్లోనే విజయం సాధించింది. ఇది రెండవ హైయెస్ట్ రికార్డ్ గా ఉంది. కేప్ టౌన్ వేదికగా 2005లో జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కేవలం 300 బంతుల్లోనే గెలుపును సొంతం చేసుకుంది. తద్వారా థర్డ్ హైయెస్ట్ రికార్డును సృష్టించింది. ఇక బంగ్లాదేశ్ జట్టుతో కాన్పూర్ మైదానం వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ను భారత్ కేవలం 312 బంతులు మాత్రమే ఎదుర్కొని విజయాన్ని సాధించింది. 1932లో మెల్బోర్న్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా కేవలం 327 బంతుల్లోనే విజయాన్ని సాధించింది.

    రన్ రేట్ విషయంలోనూ..

    ఇక కాన్పూర్ విజయం ద్వారా టీం ఇండియా మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక రన్ రేట్ తో పరుగులు సాధించిన జట్టుగా నిలిచింది. కాన్పూర్ టెస్టులో టీమిండియా 7.36 రేటుతో పరుగులు సాధించింది. 2005లో కేఫ్ టౌన్ వేదికగా జింబాబ్వే తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 6.80 రన్ రేటుతో పరుగులు చేసింది.. 2022లో రావల్పిండి మైదానం వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6.73 రేటుతో పరుగులు సాధించింది. 2023లో ఐర్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 6.43 రన్ రేట్ తో పరుగులు సాధించింది.. 2005లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 5.73 రన్ రేటుతో పరుగులు చేసింది.