https://oktelugu.com/

Anjana Devi: నా బిడ్డ పవన్ కళ్యాణ్ ని అలా చూసి ఏడ్చేసాను అంటూ అంజనా దేవి షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం గురించి పలు ప్రశ్నలు అడిగారు. మీ చిన్న కొడుకు నేడు ప్రజలను పాలించే పెద్దన్న స్థానం లో ఉన్నాడు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనగా అంజనా దేవి గారు నవ్వుతూ 'కళ్యాణ్ బాబు చిన్నతనం నుండి చాలా పట్టుదల ఉన్న వ్యక్తి..ఏదైనా చేయాలి అనుకుంటే చేసేస్తాడు' అంటూ చెప్పుకొచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ మంగళగిరి కి వెళ్తున్న సమయంలో అప్పటి ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకునేలా చేయగా పవన్ కళ్యాణ్ కి తిక్క రేగి రోడ్డు మీదనే పడుకుంటాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 05:39 PM IST

    Anjana Devi

    Follow us on

    Anjana Devi: ఎన్ని జన్మల పుణ్యం చేసుకుందో తెలియదు కానీ, చిరంజీవి తల్లి అంజనా దేవి వంటి అదృష్టవంతులు ఎవరూ ఉండరేమో అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక గృహిణి గా సాధారణమైన జీవితం గడిపే ఆమె గర్భం నుండి జన్మించిన బిడ్డలు నేడు ఎవ్వరూ చేరుకోలేని శిఖరాలకు చేరుకున్నారు. ఆ కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీ కి వచ్చిన ప్రతీ ఒక్కరు ఎంత గొప్పగా సక్సెస్ అయ్యారో మన అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాలు సినీ ఇండస్ట్రీ లో నెంబర్ 1 హీరోగా కొనసాగుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని ఇప్పటికీ కుర్ర హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీని ఇస్తూ ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్రని వేసాడు. ఇక ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

    ఈయన పేరు ఉచ్చరిస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఊగిపోతాయి. ఆయనకు అభిమానులు ఉండరు, భక్తులు మాత్రమే ఉంటారు. సినీ ఇండస్ట్రీ లో ఎన్నో సంచలన విజయాలు సాధించిన ఆయన, నేడు రాజకీయాల్లో కూడా సక్సెస్ ని అందుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజలను పాలించే స్థాయికి చేరుకున్నాడు. ఇక చిరంజీవి కొడుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని అందుకొని తండ్రినే మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇలా తన కుటుంబానికి సంబంధించిన వారంతా ఈ స్థాయిలో ఉండడాన్ని చూసి అంజనా దేవి గారికి ఎంత ఆనందం గా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి గొప్ప తల్లి మనోగతం ఆమె మాటల్లో తెలుసుకోవాలని రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అభిమానులకు సహజంగానే ఉంటుంది. అందుకే జనసేన పార్టీ తరుపున ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ని ఏర్పాటు చేసారు. రీసెంట్ గానే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ ఇంటర్వ్యూ ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.

    ఇందులో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం గురించి పలు ప్రశ్నలు అడిగారు. మీ చిన్న కొడుకు నేడు ప్రజలను పాలించే పెద్దన్న స్థానం లో ఉన్నాడు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనగా అంజనా దేవి గారు నవ్వుతూ ‘కళ్యాణ్ బాబు చిన్నతనం నుండి చాలా పట్టుదల ఉన్న వ్యక్తి..ఏదైనా చేయాలి అనుకుంటే చేసేస్తాడు’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ మంగళగిరి కి వెళ్తున్న సమయంలో అప్పటి ప్రభుత్వం పోలీసుల చేత అడ్డుకునేలా చేయగా పవన్ కళ్యాణ్ కి తిక్క రేగి రోడ్డు మీదనే పడుకుంటాడు. ఈ సంఘటన జరిగినప్పుడు అంజనా దేవి గారు చాలా బాదపడ్డారట, ఏడ్చారట కూడా. ‘అమ్మ మనసు’ పేరుతో చేసిన ఇంటర్వ్యూ ని అతి త్వరలోనే జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయబోతున్నారు. ఈ ఇంటర్వ్యూ ఎంత సెన్సేషనల్ గా ఉండబోతుందో చూడాలి.