South Africa VS India T20 Series : సౌత్ ఆఫ్రికాకు చేరుకున్న టీమిండియా.. కీలక ట్వీట్ చేసిన బిసిసిఐ..

న్యూజిలాండ్ జట్టుతో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమిండియా యువ జట్టు మరో సిరీస్ ఆడేందుకు సమయం అవుతోంది. స్వదేశంలో భారత్ ను న్యూజిలాండ్ జట్టు గట్టి దెబ్బ కొట్టగా.. దాని నుంచి మర్చిపోవడానికి టీమిండియా ప్రయత్నం చేస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 4, 2024 8:57 pm

South Africa VS India T20 Series

Follow us on

South Africa VS India T20 Series :  బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కి ముందు దక్షిణాఫ్రికా సిరీస్ లో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని టీమిండియా భావిస్తోంది. సూర్యకుమార్ ఆధ్వర్యంలో టీమిండియా సోమవారం ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా వెళ్లిపోయింది. ప్రస్తుతం భారత జట్టు డర్బన్ లో దిగింది. భారత జట్టు దక్షిణాఫ్రికా వెళ్ళిందనే విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. దానికి సంబంధించి ఒక వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ బలమైన జట్టును ఎంపిక చేసింది. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుపై ఉప్పల్ మైదానంలో అద్భుతమైన సెంచరీ చేసిన సంజు శాంసన్, మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జట్టులో స్థానం లభించింది. ఎమర్జింగ్ ఆసియా కప్ లో అద్భుతమైన ఆటతీలు ప్రదర్శించిన అభిషేక్, రమణ్ దీప్ సింగ్ కు కూడా జట్టులో స్థానం లభించింది.. ఇటీవల టీమిండియా వెస్టిండీస్ వేదిక గా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి.. ట్రోఫీని దక్కించుకుంది. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్ ను దక్కించుకుంది. శ్రీలంకతోనూ విజయం సాధించింది. స్వదేశంలో బంగ్లాదేశ్ పై కూడా సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా టి20 క్రికెట్లో ఆకాశమే హద్దుగా టీమిండియా చెలరేగిపోతోంది.

భారత జట్టు ఇదే

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రమణ్ దీప్ సింగ్, విజయ్ కుమార్, రవి బిష్ణోయ్, యశ్ దయాళ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్.

నాలుగు టి20లు

దక్షిణాఫ్రికా తో టీమ్ ఇండియా నాలుగు టి20 లో ఆడుతుంది. నవంబర్ 8న తొలి మ్యాచ్ మొదలవుతుంది. నవంబర్ పది న రెండో మ్యాచ్, నవంబర్ 13న మూడవ మ్యాచ్, నవంబర్ 15న చివరి మ్యాచ్ జరుగుతుంది. ఇక జూన్ 29న బార్బడోస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై భారత్ విజయం సాధించింది. అయితే నాడు భారత్ చేతిలో కప్ కోల్పోయిన మార్క్రమ్.. ఈ సిరీస్ గెలుచుకోవాలని భావిస్తోంది. భారత జట్టుతో జరిగే టి20 సిరీస్ కు సమర్థవంతమైన జుట్టును ఎంపిక చేసింది. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. జట్టులో సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం కల్పించింది. ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ఫామ్ లో ఉంది. అదే ఊపు లో టీమిండియాను ఓడించి, సిరీస్ పట్టేయాలని చూస్తోంది.