Gopichand Vishwam : ఓటీటీ లో గోపీచంద్ ‘విశ్వం’ చిత్రానికి ఊహించని స్పందన.. ఇప్పటి వరకు ఎన్ని వ్యూస్ వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

హీరో గోపీచంద్ మార్కెట్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు, ఒక మోస్తారు సినిమాని ఇచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తారు అనేది ఈ సినిమాతో రుజువు అయ్యింది. రొటీన్ శ్రీను వైట్ల మార్క్ సినిమానే అయ్యినప్పటికీ కామెడీ పేలడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి కమర్షియల్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం.

Written By: Vicky, Updated On : November 4, 2024 9:02 pm

Gopichand Vishwam

Follow us on

Gopichand Vishwam :  దసరా రోజు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన గోపీచంద్ ‘విశ్వం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సైలెంట్ హిట్ గా నిల్చింది. మొదటి రోజు కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయిన ఈ సినిమా పరిస్థితిని చూసి, గోపిచంద్, శ్రీనువైట్ల ప్రస్తుతం డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్నారు కదా, వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన సినిమా కాబట్టి ఆడియన్స్ ఏమాత్రం ఆసక్తి చూపించలేదని, క్లోజింగ్ కలెక్షన్స్ రెండు కోట్ల రూపాయిల లోపే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ చిత్రం ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యపరుస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోయింది. 70 లక్షల రూపాయిల ఓపెనింగ్ తో మొదలైన ఈ సినిమా 18 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

దీంతో హీరో గోపీచంద్ మార్కెట్ కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు, ఒక మోస్తారు సినిమాని ఇచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తారు అనేది ఈ సినిమాతో రుజువు అయ్యింది. రొటీన్ శ్రీను వైట్ల మార్క్ సినిమానే అయ్యినప్పటికీ కామెడీ పేలడంతో బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి కమర్షియల్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. అయితే థియేటర్స్ లో రన్ అవుతున్నప్పటికీ కూడా ఈ చిత్రాన్ని రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. ఇండియా వైడ్ గా టాప్ 1 ట్రెండ్ అవుతున్న ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందని మేకర్స్ అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉండడంతో థియేట్రికల్ పరంగా మాత్రమే కాకుండా, ఓటీటీ లో కూడా ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యింది అనొచ్చు.

అమెజాన్ ప్రైమ్ సంస్థ గణాంకాల ప్రకారం నవంబర్ 1 వ తేదీన స్ట్రీమింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 20 లక్షల వ్యూస్ వచ్చాయట. రీసెంట్ గా విడుదలైన తెలుగు సినిమాలన్నిటికంటే ఈ చిత్రానికి ఎక్కువ వ్యూస్ వచ్చినట్టు తెలుస్తుంది. గోపీచంద్ ప్రస్తుతం ఉన్న ఫామ్ కి ఈ స్థాయి వ్యూస్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఆయనకి ఆడియన్స్ లో పాత సినిమాల ద్వారా తెచ్చుకున్న ఇమేజ్ కారణంగా మంచి పాజిటివ్ అభిప్రాయం ఉంది. ఇక నుండి అయినా గోపీచంద్ సరైన స్క్రిప్టులు ఎంచుకొని ముందుకు పోతే కచ్చితంగా ఆయన మార్కెట్ కి పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. గోపీచంద్ కూడా తన తదుపరి చిత్రాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గానే ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్ తో పని చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.