
‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్-రాజమౌళి ఎవరి ప్రాజెక్ట్‌లతో వాళ్లు బిజీగా ఉన్నారు. అయితే, వీరిద్దరి కాంబినేషన్ మరో సినిమా వస్తే చూడాలని సినీ ప్రియులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో కలిసి మరోసారి పనిచేయడంపై తాజాగా రాజమౌళి స్పందించారు. ”బాహుబలి’ కోసం ఐదేళ్లు కలిసి పనిచేయడం వల్ల మా మధ్య అనుబంధం మరింత పెరిగింది. అయితే, మా ఇద్దరిలో ఆసక్తి రేకెత్తించే కథ సిద్ధమైతే.. తప్పకుండా మేమిద్దరం మరోసారి కలిసి పని చేస్తాం’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.