IND vs AUS : చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా

IND vs AUS : ఒకసారి గురితప్పింది.. కానీ రెండోసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. శ్రీలంక ఓటమితో సమీకరణాలతో పనిలేకుండా టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించింది. అంతేకాదు.. ఆస్ట్రేలియాపై 2-1తో గెలిచి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. కొత్త చరిత్రను లిఖించింది. స్వదేశంలో టీమిండియాను కొట్టే జట్టే లేదని మరోసారి నిరూపితమైంది. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రా […]

Written By: NARESH, Updated On : March 13, 2023 7:30 pm
Follow us on

IND vs AUS : ఒకసారి గురితప్పింది.. కానీ రెండోసారి అదృష్టం కూడా కలిసి వచ్చింది. శ్రీలంక ఓటమితో సమీకరణాలతో పనిలేకుండా టీమిండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించింది. అంతేకాదు.. ఆస్ట్రేలియాపై 2-1తో గెలిచి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది టీమిండియా. కొత్త చరిత్రను లిఖించింది. స్వదేశంలో టీమిండియాను కొట్టే జట్టే లేదని మరోసారి నిరూపితమైంది.

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసింది. ఈ టెస్ట్ డ్రా గా ముగిసినప్పటికీ భారత్ 2-1 తేడాతో ట్రోఫీని గెలిచింది. ఈ సిరీస్ ను గెల్చుకోవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. తాజా సిరీస్ ను గెల్చుకోవడం ద్వారా భారత్ స్వదేశంలో వరుసగా 16 వ టెస్టు సిరీస్ ను గెల్చుకున్నట్టు అయ్యింది.

ఓటమి ఎరుగని భారత్..

స్వదేశంలో భారత్ ఎప్పుడూ బలమైన టీమ్. భారత్ పర్యటనకు వచ్చే ఆయా దేశాల క్రికెట్ టీమ్ లు టెస్టుల్లో భారత్ ను ఒడించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాయి. అయితే, స్వదేశంలో ఎప్పుడూ బలంగా ఉండే భారత్ ను ఓడించి సిరీస్ ను కైవసం చేసుకోవడం గత పదేళ్ల నుంచి ఏ దేశానికి సాధ్యపడలేదు. తాజాగా భారత్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు అది సాధ్యపడలేదు. దీంతో గత పదేళ్ల నుంచి భారత్ లో టెస్టు సిరీస్ విజయం సాధించడం ఏ దేశానికి సాధ్యపడకపోవడం గమనార్హం.

పెద్ద టీములపై విజయాలు..

2013 నుంచి తాజా ఆస్ట్రేలియా సిరీస్ వరకు భారత్ పర్యటనకు అనేక దేశాలు వచ్చాయి. వీటిలో బలమైన, పెద్ద టీములు ఉన్నాయి. ఏ దేశం కూడా సిరీస్ విజయంతో వెళ్లిన దాఖలాలు లేవు. 2013 నుంచి వరుసగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లపై టెస్టు సిరీస్ విజయాలను భారత్ దక్కించుకుంది.

ఏకైక టీమ్ గా భారత్..

ఇకపోతే, 2016 నుంచి 2023 వరకు జరిగిన నాలుగు బోర్డర్ – గవాస్కర్ సిరీస్ ను భారత్ గెలిచి చరిత్ర సృష్టంచింది. గడిచిన 30 ఏళ్లలో ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. 2016-17 లో ఇండియా వేదికగా జరిగిన బోర్డర్ – గవాస్కర్ సిరీస్ ను భారత్ 2-1 తో గెల్చుకోగా, 2018-19 లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన సిరీస్ ను భారత్ 2-1 తో విజయం సాధించింది. అలాగే, 2020-21 ఆస్ట్రేలియా వేదికగా జరిగిన సిరీస్ ను మరోసారి భారత్ 2-1 తో కైవసం చేసుకుని వరుసగా మూడో సారి ఈ సిరీస్ ను దక్కించుకుంది. తాజాగా, ఈ సిరీస్ లో భాగంగా భారత్ పర్యటనకు వచ్చిన ఆసీస్ కు మరోసారి సిరీస్ ఓటమి తప్పలేదు. 2-1 తో భారత్ టెస్ట్ సిరీస్ ను చేజిక్కించుకుంది. వరుసగా నాలుగుసార్లు ఈ టెస్ట్ సిరీస్ ను దిక్కించుకుని భారత్ చరిత్ర సృష్టించింది.