Homeక్రీడలుParalympics 2024 : పారా ఒలంపిక్స్ లో కొనసాగుతున్న భారత షూటర్ల హవా.. మూడో రోజూ...

Paralympics 2024 : పారా ఒలంపిక్స్ లో కొనసాగుతున్న భారత షూటర్ల హవా.. మూడో రోజూ పతక భాగ్యం

Paralympics 2024 : పారా ఒలింపిక్స్ లో రెండవ రోజూ భారత ఖాతాలో మరో మెడల్ చేరింది. షూటర్ రుబీనా 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో కాంస్యం దక్కించుకుంది. దీంతో ఇప్పటివరకు భారత్ 5 మెడల్స్ సాధించినట్టయింది. ఆర్చరీలో 17 సంవత్సరాల శీతల్ దేవి, సరితా దేవి తమ పోరాటాన్ని ముగించారు.. పాయింట్ తేడాతో ప్రీ క్వార్టర్స్ లో శీతల్ నిరాశ చెందింది. క్వార్టర్స్ లో సరిత పరాజయం పాలైంది. తెలుగు క్రీడాకారులు రోయర్ నారాయణ, సైక్లిస్ట్ షేక్ అర్షద్ దారుణమైన ప్రదర్శనతో ఖాళీ చేతులతో వేణు తిరిగారు. షూటింగ్ విభాగంలో మాత్రం భారత అథ్లెట్లు సత్తా చాటారు. మహిళల పదమిట్టాల ఎయిర్ ఫిస్టల్ ఎస్ హెచ్ -1 విభాగంలో షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం దక్కించుకుంది. ఇప్పటికే ఈ విభాగంలో అవని స్వర్ణం సాధించింది. మనీష్ రజితం సాధించాడు. మోనా కాంస్యం అందుకుంది. ఇక ఈ జాబితాలో రూబీ నా కూడా చేరింది. భారత్ ఇప్పటివరకు ఐదు మెడల్స్ సాధించగా.. షూటింగ్లోనే నాలుగు మెడల్స్ రావడం విశేషం.. శనివారం జరిగిన ఫైనల్ లో రుబీనా అత్యంత కఠినమైన పోటీని ఎదుర్కొంది. 211.1.లతో తృతీయ స్థానంలో నిలిచింది. స్టేజ్ -1 లో పది షాట్లు పూర్తయ్యేసరికి మూడవ స్థానాన్ని దక్కించుకుంది. 14 షాట్ తర్వాత ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. ఆ సమయంలో ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా చివరి సిరీస్ లో సత్తా చాటింది. 9.2, 8.9 స్కోర్ తో కాంస్యాన్ని ఖాయం చేసుకుంది. వాస్తవానికి క్వాలిఫై రౌండ్ లో 56 పాయింట్లు సాధించి ఏడవ స్థానంలో నిలిచిన రూబీనా.. చివరి పోరుకు అర్హత సాధించింది. టోక్యోలో జరిగిన పారా ఒలంపిక్స్ లో రుబీనా ఫైనల్ వెళ్ళింది. అయితే అప్పుడు ఏడవ స్థానంలో నిలిచి నిరాశతో వెనుదిరిగింది. ఇక పురుషుల పదమెట్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ -1 లో స్వరూప్ నిరాశపరిచాడు. క్వాలిఫై ఈవెంట్లో 14 స్థానంలో నిలిచాడు.

ఇక ఈ పారా గేమ్స్ లో తెలుగు క్రీడాకారులు నారాయణ, అర్షద్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సైక్లిస్ట్ అర్షద్ పురుషుల వెయ్యి మీటర్ల టైం ట్రయల్ సీ 1-3 క్వాలిఫై ఈవెంట్లో దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఏ మాత్రం సత్తా చాటలేక చివరి స్థానంలో నిలిచాడు. ఇక శుక్రవారం జరిగిన 3000 మీటర్ల సీ2 ఈవెంట్ లోనూ అర్షద్ తుది స్థానంలో నిలవడం విశేషం. ఇక మహిళలకు సంబంధించి 500 మీటర్ల టైం ట్రయల్ సీ -1-3 లో జ్యోతి కూడా ఆఖరి స్థానంలో నిలిచింది.. అర్షద్, జ్యోతి రోడ్ సైక్లింగ్ విభాగంలో అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. రోయింగ్ విభాగంలోనూ అనిత – నారాయణ జోడి మెడల్ కు అర్హత సాధించలేకపోయారు.. షూటింగ్లో 17 సంవత్సరాల శీతల్ దేవి మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పాయింట్ తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. తొలి సెట్ అద్భుతంగా ప్రారంభించిన ఆమె.. మిగతా సెట్లలో ఆ జోరు కొనసాగించలేకపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular