Rohit Sharma: కోచ్ గా కొనసాగాలని ద్రవిడ్ ను ఒప్పించాలనుకున్నా.. కానీ

రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో.. అతడిని కొనసాగించే ఉద్దేశం లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పటికే స్పష్టం చేశాడు.. దీంతో కొత్త కోచ్ నియామకం అనివార్యమని ఆయన మాటల్లో తేలిపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 5, 2024 7:17 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: టి20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్త కోచ్ భారత జట్టుతో జాయిన్ అవుతాడు. కొత్త కోచ్ పదవీకాలం నాలుగేళ్ళ పాటు ఉంటుంది. ఇప్పటికే కొత్త కోచ్ నియమాకం కోసం బీసీసీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. పలువురు మాజీ క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. ఈ దరఖాస్తుల అందజేతకు గడువు కూడా ముగిసింది. ఇప్పటివరకు 3000 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఫేక్ దరఖాస్తులు కూడా ఉన్నాయని జాతీయ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో.. అతడిని కొనసాగించే ఉద్దేశం లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా ఇప్పటికే స్పష్టం చేశాడు.. దీంతో కొత్త కోచ్ నియామకం అనివార్యమని ఆయన మాటల్లో తేలిపోయింది. అయితే అప్పట్లో మాథ్యూ హెడెన్, డివిలియర్స్, వీవీఎస్ లక్ష్మణ్, ఇంకా కొంతమంది మాజీ క్రీడాకారులు టీమిండియా హెడ్ కోచ్ రేసులో ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అవి గాలి కబుర్లని తేలిపోయింది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ రేసులో గౌతమ్ గంభీర్ పేరు మార్మోగిపోతోంది. అయితే అతని నియామకంపై ఇంతవరకు బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

రాహుల్ ద్రావిడ్ కోచ్ గా తన చివరి టోర్నీని పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.. రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా పనిచేసేందుకు ఒప్పించాలని చూశాడట. కానీ అతడికి చాలా పనులు ఉన్నాయనే ఉద్దేశంతో మానుకున్నాడట. అతనితో కలిసి పని చేయడం రోహిత్ శర్మకు చాలా ఇష్టమట. మిగతా ఆటగాళ్లు కూడా అలానే భావిస్తుంటారట. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ క్రికెట్ ఆరంగేట్రం ఐర్లాండ్ జట్టుతో జరిగిందట. అప్పుడు టీం ఇండియాకు ద్రావిడ్ కెప్టెన్ గా ఉన్నాడట.. ఇప్పటికీ ద్రావిడ్ నే రోహిత్ శర్మ ఆదర్శంగా భావిస్తాడట. ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ కు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.