Team India Bowling: ఐర్లాండ్ ఎగతాళి చేస్తోంది. చివరికి అనామకమైన జట్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నాయి. మీరు నెంబర్ వన్ కదా.. పొట్టి ప్రపంచ కప్ లు గెలిచారు కదా . ఇదా మీ ఆట.. పోయి ప్లాట్ మైదానాల మీద ఆడుకోండి.. మీ ఘన చరిత్ర లను.. మీ సొంత మీడియాలో చెప్పుకోండి అంటూ.. ఎగతాళి చేస్తున్నాయి.
భారత జట్టుకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమై ఉంటుంది.. ఇలా చిన్న చిన్న జట్ల చేతిలో ఓడిపోవడం. విమర్శల పాలు కావడం.. మేనేజ్మెంట్ కు అర్థం కావడం లేదా.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు సగటు అభిమాని మదిలో మెదులుతున్నాయి.
వాస్తవానికి టీమిండియా బౌలింగ్ బలంగా ఉంటుంది. పొట్టి ఫార్మాట్లో భారత జట్టు బౌలింగ్ కు తిరుగులేదు. అటువంటి టీమ్ ఇండియా బౌలింగ్ ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్లో టీమ్ ఇండియా బౌలింగ్ అత్యంత చెత్తగా ఉంది. ఈ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు ప్రతి సందర్భాల్లోనూ మనోళ్ల బౌలింగ్ మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ బ్యాటర్ల మాదిరిగా టీమిండియా బ్యాటర్లు ఆడలేకపోయారు. వాస్తవానికి ఇంగ్లాండ్ బ్యాటర్లతో పోల్చి చూస్తే టీమ్ ఉండే బ్యాటర్లకు అద్భుతమైన అ టాకింగ్ పవర్ ఉంటుంది. కానీ దానిని అందిపుచ్చుకోలేకపోయారు. ఐపీఎల్ ప్రభావమా.. మరొకటా తెలియదు గాని.. భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ మైదానాల మీద తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బౌలర్లు పరుగులు ఇవ్వడంలో పోటీ పడితే.. బ్యాటర్లు పరుగులు తీయకుండా అవుట్ అవ్వడంలో పోటీపడ్డారు.
టీమిండియా బౌలింగ్ ఇలా నాసిరకంగా ఎందుకు మారిపోయింది.. అనే ప్రశ్నకు సమాధానం ఐపీఎల్ అని అందరూ చెబుతున్నప్పటికీ.. అది మాత్రమే కాకుండా.. బౌలర్లు సరైన లెంగ్త్ లో వేయడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇంగ్లాండ్ మైదానాలు బౌన్సీ గా ఉంటాయి. అలాంటప్పుడు వికెట్లు తీయడం పెద్ద కష్టం కాదు. ఇంగ్లాండ్ బౌలర్లు దానిని చేసి నిరూపిస్తున్నారు. కానీ టీమ్ ఇండియా బౌలర్లకు అది చేత కావడం లేదు. చివరి టీ 20 మ్యాచ్లో టీమ్ ఇండియా బౌలర్లు బట్లర్.. బ్రూక్ ఔట్ చేయలేక చేతులెత్తేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా రికార్డు స్థాయిలో 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అది కూడా కేవలం 102 బంతుల్లోనే..
వీరిద్దరిని అవుట్ చేయడానికి టీమ్ ఇండియా కెప్టెన్ అయ్యర్ ఏకంగా ఆరుగురు బౌలర్లను రంగంలోకి దింపాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ బ్యాటర్ బట్లర్ ఏకంగా 131 పరుగులు చేశాడు.. దీనిని బట్టి మన వాళ్ళ బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి టీమిండియా బౌలింగ్ ఇలానే కొనసాగితే భవిష్యత్తు కాలంలో పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఇప్పటికే ఆటగాళ్ల ఆట తీరు పట్ల మేనేజ్మెంట్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇదే కంటిన్యూ అయితే ప్లేయర్ల స్థానాలు..కోచ్ ల స్థానాలు గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
image.png
