India Vs Afghanistan Analysis: రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఏకంగా 402 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం మీద ఎవరికి ఎటువంటి అనుమానం లేదు. ఎంత తేడాతో గెలుస్తుంది అన్నది ఇక్కడ ప్రధానం. టీమిండియాలో కెప్టెన్ గిల్ 154, కిషన్ 125, రోహిత్ 48 పరుగులతో అదరగొట్టారు. టీమిండియా భారీ స్కోర్ చేయడంలో మీరు ముగ్గురు కీలకపాత్ర పోషించారు. ఓవర్ కు 8 చొప్పున పరుగులు తీస్తూ.. అదరగొట్టారు.
వీరి ముగ్గురి ఆట తీరు గొప్పగా ఉంటే.. మిగతా ప్లేయర్ల ఆట అత్యంత చండాలంగా ఉంది. అసలు చెప్పుకోవడానికి దరిద్రంగా ఉంది. పైగా వారేమీ అనామక ప్లేయర్లు కాదు. ఈ సిరీస్ ను మేనేజ్మెంట్ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సన్నాహకంగా భావిస్తుంది. అలాంటప్పుడు ఈ ప్లేయర్లు ఎంతో గొప్పగా ఆడాల్సి ఉండేది. అలాకాకుండా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. రోహిత్, గిల్, కిషన్ భారీగా పరుగులు చేసినప్పటికీ.. వారి స్థాయిలో ఆడ లేక చేతులెత్తేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల ముందు తలవంచారు.
జైస్వాల్ నాలుగు, కేఎల్ రాహుల్ సున్నా, వాషింగ్టన్ సుందర్ 19, బ్రార్ మూడు, అర్ష్ దీప్ సింగ్ 3, ప్రిన్స్ యాదవ్ 5.. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో టీమిండియా దాదాపు 500 స్కోరు చేస్తుందనుకుంటే.. 402 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఒక దశలో గిల్, కిషన్ మూడో వికెట్ కు ఏకంగా 224 పరుగులు జోడించారు. కేవలం 140 బంతుల్లోనే వారు ఈ స్థాయిలో పరుగులు సాధించడం విశేషం. వారిద్దరు అవుట్ కావడంతో టీమిండియా పరిస్థితి దారుణంగా మారింది..
360 పరుగుల వద్ద టీమ్ ఇండియా గిల్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోతే.. మిగతా 6 వికెట్లను టీమిండియా కేవలం 62 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం. ఏ ఆటగాడు కూడా సరిగ్గా ఆడలేకపోయాడు.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను ప్రతిఘటించలేకపోయాడు. దీంతో భారత్ స్కోరు 402 పరుగుల వద్ద ముగిసిపోయింది.. ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసిందని అభిమానులు సంబర పడుతున్నప్పటికీ.. లోపాలు వెలుగు చూడడం.. కీలక ఆటగాళ్లు నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
Lucknow was delighted by Shubman Gill’s marathon knock
Updates ▶️ https://t.co/JYJ5l44iJ6#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/wsE6ND6zBD
— BCCI (@BCCI) June 17, 2026
