IPL New Sponsor: ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. అభిమానుల్లో వస్తున్న ఉత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రచిస్తోంది. 15వ ఎడిషన్ ను ముమ్మరంగా కొనసాగించాలని భావిస్తోంది. ఐపీఎల్-2022 నిర్వహణకు నడుం బిగించింది. ఆటగాళ్ల వేలానికి సమాయత్తమవుతోంది. వచ్చే నెల 12,13 తేదీల్లో వేలం నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది.
గతంలో ఐపీఎల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వివో స్థానంలో ప్రస్తుతం టాటా గ్రూప్ తీసుకుంది. వివో 2018 ఐపీఎల్ సీజన్ నుంచి 2022 వరకు స్పాన్సర్ గా ఉన్నందుకు రూ.2200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే చైనాతో సరిహద్దులో జరిగిన గొడవల కారణంగా వివోను స్సాన్సర్ నుంచి వైదొలగించినట్లు తెలుస్తోంది
Also Read: సచిన్ రీ ఎంట్రీ.. సౌరవ్ గంగూలీ తన బ్యాచ్ నంతా బీసీసీఐలోకి ఎందుకు దింపుతున్నాడు?
ఈ ఏడాది లక్నో, అహ్మదాబాద్ జట్లు ప్రీమియర్ లీగులో చేరనున్నాయి. దీంతో ఈ జట్లకు కూడా ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగిపోతోంది. ఫ్రాంచైజీలు సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఆటగాళ్ల వేలానికి భారీ రెమ్యూనరేషన్ ముట్టజెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆటగాళ్ల ఎంపికపై దృష్టి పెట్టాయి. మొత్తానికి ఐపీఎల్ లో అభిమానులు సందడి చేయనున్నట్లు సమాచారం.
దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన టాటా గ్రూప్ ఈఏడాది ఐపీఎల్ టైటిల్ కొత్త స్పాన్సర్ గా వ్యవహరించడంతో అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మన దేశ సంస్థకు అధికారం అప్పగించడంపై అందరిలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఇన్నాళ్లు విదేశీ సంస్థలకు లాభాలు రావడంతో అందరిలో ఆగ్రహాలు రాగా ప్రస్తుతం దేశీయ సంస్థతో ఎవరు కూడా నిరసన తెలపడం లేదు.
Also Read: చైనాతో సరిహద్దు వివాదం ఎఫెక్ట్… ఐపీఎల్ స్పాన్సర్‌గా టాటా..