Taruwar Kohli: క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై

పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ ప్రాంతంలో కోహ్లీ పుట్టాడు. ఆ రాష్ట్రం తరఫున క్రికెట్లో తనకు అవకాశాలు రాకపోవడంతో మిజోరం రాష్ట్రానికి వలస వెళ్లాడు.

Written By: Suresh, Updated On : February 21, 2024 3:02 pm
Follow us on

Taruwar Kohli: నిన్ననే కదా తనకు ఫిబ్రవరి 15న కొడుకు పుట్టాడని.. అతడి పేరు అకాయ్ అని పెట్టామని.. ఈ శుభ సందర్భంలో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకండి అంటూ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.. ఇంతలోనే అతడికి ఏమైంది? ఒక్కసారిగా కెరియర్ ఎందుకు ముగించాడు? ఎంతో వయసు ఉన్నప్పటికీ అర్ధాంతరంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అని అనుకుంటున్నారు కదూ.. కానీ క్రికెట్ కు గుడ్ బై చెప్పింది విరాట్ కోహ్లీ కాదు. అతడి సహచరుడు, మిజోరం రాష్ట్ర జట్టు మాజీ కెప్టెన్ తర్వాత తరువార్ కోహ్లీ. 35 సంవత్సరాల తరువార్ కోహ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ లోని అన్ని ఫార్మట్లనుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.

పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ ప్రాంతంలో కోహ్లీ పుట్టాడు. ఆ రాష్ట్రం తరఫున క్రికెట్లో తనకు అవకాశాలు రాకపోవడంతో మిజోరం రాష్ట్రానికి వలస వెళ్లాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తం 55 మ్యాచ్లు తరువార్ ఆడాడు. మొత్తం 97 ఇన్నింగ్స్ ల్లో 53.80 సగటున 4,573 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తరు వార్ ఏకంగా 307 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ ఘనత మాత్రమే కాదు అతడి ఖాతాలో రెండు ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.

తరు వార్, విరాట్ కు 2008లో స్నేహం కుదిరింది. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా వీరిద్దరూ భారత జట్టు తరఫున ఆడారు. ఆ టోర్నీలో తరువార్ మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆ టోర్నీలో మూడవ అతిపెద్ద స్కోరర్ గా నిలిచాడు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్ వేసే తరువార్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 74 వికెట్లు తీశాడు.. లిస్ట్ ఏ క్రికెట్ లో 41, టీ – 20 ల్లో 18 వికెట్లు సాధించాడు. బౌలింగ్ మాత్రమే కాదు బ్యాటింగ్ లోనూ తరు వార్ కు మంచి రికార్డు ఉంది..లిస్ట్ – ఏ లో తరువార్ మూడు సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం 72 మ్యాచ్ ల్లో 1,913 పరుగులు చేశాడు. 57 టీ – 20 మ్యాచ్ ల్లో 7 హాఫ్ సెంచరీల సహాయంతో 1,057 పరుగులు చేశాడు.

తరువార్ ఐపీఎల్ లోనూ సత్తా చాటాడు. 2008, 2009 సీజన్ లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరియర్ లో నాలుగు మ్యాచ్లు ఆడిన తరువార్ కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు.. 2008 అండర్ 19 వరల్డ్ కప్ లో విరాట్ తో కోహ్లీకి స్నేహం ఏర్పడింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. తరు వార్ తో పాటు రవీంద్ర జడేజా కూడా అప్పట్లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. టీమిండియా అండర్ – 19 కప్ గెలవడంలో కృషి చేశారు.