Tanush Kotian: ఈ టోర్నీలో టీమిండియా, ఆస్ట్రేలియా చెరొక విజయం సాధించాయి. మూడవ టెస్ట్ డ్రా అయింది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని అటు ఆస్ట్రేలియా, ఇటు టీమిండియా భావిస్తున్నాయి. అయితే ఇటీవల టీమిండియా స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతని స్థానంలో కొత్త బౌలర్ కు అవకాశం కల్పించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.. ముంబై ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోటియన్ కు సెలక్టర్లు జట్టులో చోటు కల్పించాలని తెలుస్తోంది. ముంబై తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడే తనుష్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. అతడు ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు. మంగళవారం ఉదయం అతడు ఆస్ట్రేలియా కు బయలుదేరి వెళ్ళాడు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. జట్టులో స్పిన్ బౌలర్లుగా జడేజా, వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఉన్నారు. అయితే వాషింగ్టన్ సుందర్, జడేజా ఇప్పటికే అవకాశాలు లభించాయి. దీంతో తనుష్ ను మూడవ స్పిన్నర్ గా జట్టులోకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా – ఏ జట్టుతో భారత్ – ఏ అనధికారికంగా రెండు టెస్టులు ఆడింది. ఇందులో ఒక టెస్టులో తనుష్ ఆడాడు. ఒక వికెట్ పడగొట్టాడు. 44 పరుగులు సాధించాడు..
కెరియర్ ఎలా ఉందంటే..
తనుష్ ఆఫ్ స్పిన్నర్ మాత్రమే కాదు.. మెరుగైన ఆల్రౌండర్ కూడా. ఇప్పటివరకు అతడు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించాడు. 1525 పరుగులు చేశాడు. 41.1 సగటు నమోదు చేశాడు. 101 వికెట్లు పడగొట్టాడు. 25.7 సగటుతో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అతడు రెండు సెంచరీలు చేశాడు. 13 హాఫ్ సెంచరీలు బాదాడు. ముంబై జట్టు 2023 -24 సీజన్లో రంజీ ట్రోఫీలో విజయం సాధించింది. అప్పుడు ముంబై జట్టులో తనుష్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ ది టోర్నీ పురస్కారం దక్కించుకున్నాడు. నాటి సీజన్లో అతడు 502 రన్స్ చేశాడు. 29 వికెట్లు దక్కించుకున్నాడు. ఇరాన్ కప్ లో రెస్ట్ ఆఫ్ ఇండియా పై సెంచరీ చేశాడు. అతని బ్యాటింగ్ దూకుడు వల్ల ముంబై జట్టు 27 సంవత్సరాల తర్వాత ఇరానీ కప్సం చేసుకుంది. దులీప్ ట్రోఫీలో పది వికెట్లు పడగొట్టాడు.. వాస్తవానికి తనుష్ స్థానంలో అక్షర్ పటేల్ ను ఆస్ట్రేలియా పంపించాలని టీమిండియా సెలెక్టర్లు అనుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాలవల్ల అక్షర్ విజయ్ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. దీంతో తనుష్ కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. తనుష్ విభిన్నమైన బంతులు వేస్తాడు. నిర్జీవమైన మైదానంపై స్పిన్ రాబడతాడు. మెల్ బోర్న్ టెస్ట్ లో అతడు అదే విధంగా బౌలింగ్ వేస్తే టీమ్ ఇండియాకు తిరుగు ఉండదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.