Homeక్రీడలుRavichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ కు 500 బంగారు నాణాలతో అరుదైన సత్కారం

Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ కు 500 బంగారు నాణాలతో అరుదైన సత్కారం

Ravichandran Ashwin: భారత ఏస్ స్పిన్నర్ కు అరుదైన సత్కారం లభించింది. టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ కు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) ఘనంగా సత్కరించింది. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయికి గుర్తుగా.. 500 బంగారు నాణాలతో రవిచంద్రన్ అశ్విన్ ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సత్కరించింది. కేవలం బంగారు నాణాలు మాత్రమే కాదు, కోటి రూపాయల నగదు బహుమతితో గౌరవించింది. ఈ సన్మాన కార్యక్రమంలో భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పలువురు పాల్గొన్నారు.

ఈ సన్మాన కార్యక్రమంలో రవిచంద్రన్ అశ్విన్ తన భార్య ప్రీతి, ఇద్దరు కూతుర్లతో పాల్గొన్నాడు. వారి సమక్షంలో బంగారు నాణాలను అందుకున్నాడు. వాటిని స్వీకరించిన తర్వాత ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ.. 500 వికెట్ల మైలురాయి సాధించిన సందర్భంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తనను ఈ విధంగా సన్మానించడం గొప్ప విషయం అన్నారు. ఇది 500 వికెట్ల మైలురాయి సాధించిన దానికంటే మరింత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇంతటి ఘనత సాధించడానికి తన వెనుక కుటుంబం ఉందన్నారు. భార్య ప్రీతి, తల్లిదండ్రులు ప్రోత్సహించారని పేర్కొన్నాడు. వారు తనపై ఉంచిన నమ్మకం కోల్పోకుండా ఆటలో ప్రతిభ చూపానని రవిచంద్రన్ అశ్విన్ వివరించాడు.. అశ్విన్ భార్య ప్రీతి మాట్లాడుతూ.. ఈ సన్మానం జీవితంలో మర్చిపోలేమన్నారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు.

రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా కీలక స్పిన్నర్ గా కొనసాగుతున్నాడు. టెస్ట్ ఫార్మాట్ లో 500 వికెట్ల మైలురాయి సాధించాడు. రాజ్ కోట్ టెస్టులో ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలే వికెట్ తీయడం ద్వారా అశ్విన్ టెస్ట్ క్రికెట్లో 500 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొమ్మిదవ అంతర్జాతీయ బౌలర్ గా ఘనత సృష్టించాడు. అంతేకాదు అది తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. రవిచంద్రన్ అశ్విన్ 99 టెస్టుల్లో 25,714 బంతులు సంధించి 500 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్ గ్రాత్( Glen Mc Grath) 22,528 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. తక్కువ టెస్టుల్లోనే 500 వికెట్లు పడగొట్టిన రెండవ బౌలర్ గా అశ్విన్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నా. శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(Muttaih Muralidharan) 87 మ్యాచ్ లలో 500 వికెట్లు తీశాడు. అశ్విన్ 98 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.. భారత జట్టుకు చెందిన అనిల్కంలో 105 టెస్టుల్లో 500 వికెట్లు తీసి మూడవ స్థానంలో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా లెజండరీ స్పిన్నర్ షేన్ వార్న్ 108, గ్లెన్ మెక్ గ్రాత్ 110 మ్యాచ్ లలో 500 వికెట్లు తీశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular