Homeక్రీడలుక్రికెట్‌Taliban Threats Pakistan Super League 2026: తాలిబన్లు తుపాకులు లేపారు.. పాకిస్థాన్ సూపర్ లీగ్...

Taliban Threats Pakistan Super League 2026: తాలిబన్లు తుపాకులు లేపారు.. పాకిస్థాన్ సూపర్ లీగ్ ఇక ముగిసిన అధ్యాయం!

Taliban Threats Pakistan Super League 2026: రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారు. ఈ సామెతను నిజం చేసి చూపించారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు. కొంతకాలంగా పాకిస్తాన్ మీద తీవ్రంగా మండిపడుతున్న తాలిబన్లు.. ఇప్పుడు ఏకంగా ఆ దేశంలో నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ మీద దృష్టి సారించారు. ఈ సూపర్ లీగ్ మరో ఆరు రోజుల్లో మొదలు కాబోతోంది. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ మే నెలలో మూడో తేదీ వరకు సాగుతుంది. […]

Taliban Threats Pakistan Super League 2026: రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారు. ఈ సామెతను నిజం చేసి చూపించారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు. కొంతకాలంగా పాకిస్తాన్ మీద తీవ్రంగా మండిపడుతున్న తాలిబన్లు.. ఇప్పుడు ఏకంగా ఆ దేశంలో నిర్వహించే పాకిస్తాన్ సూపర్ లీగ్ మీద దృష్టి సారించారు. ఈ సూపర్ లీగ్ మరో ఆరు రోజుల్లో మొదలు కాబోతోంది. మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ మే నెలలో మూడో తేదీ వరకు సాగుతుంది.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

ఈ టోర్నీ ని అద్భుతంగా నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్పీడ్ బ్రేకర్ వేసింది. ముందుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును దెబ్బ కొట్టింది.. ఒకవేళ బంగ్లాదేశ్ ప్లేయర్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు వస్తే తలలు లేచిపోతాయని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు హెచ్చరించారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ అబే దిన్ సంచలన ప్రకటన చేశారు. బంగ్లా ప్లేయర్లను పాకిస్తాన్ పంపించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో.. తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ వ్యాఖ్యానించారు.. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఆందోళన నెలకొంది. ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడి చేసింది. కాబుల్ నగరంలో ఆసుపత్రి మీద బాంబులు వేసింది. ఈ దారుణంలో 400 మంది చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్ మీద సరైన సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ దేశానికి హెచ్చరికలు జారీ చేశారు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో బంగ్లాదేశ్ ఆడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఆఫ్ఘనిస్తాన్ పరిపాలకులు స్పష్టం చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా ప్లేయర్లు వెనకడుగు వేశారు. అదే దారిలో మిగతా ప్లేయర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ ముగిసిన అధ్యాయం లాగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ భారత్ లో ఆడేందుకు ముందుకు రాలేదు. ఆ సమయంలో బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ సమర్ధించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు సపోర్ట్ చేసింది. చివర్లో పాకిస్తాన్ గోడ మీద పిల్లి మాదిరిగా వ్యవహరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు భారత్ తో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో బంగ్లాదేశ్ వెర్రి పుష్పం అయిపోయింది. అటు ఆదాయాన్ని కోల్పోయింది. ఇటు ఐసీసీ లో పరపతిని కోల్పోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరికలు జారీ చేయడంతో ఏకంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper