Ishan Kishan: టి20 వరల్డ్ కప్ లో అమెరికాపై చివరి వరకు పోరాడి గెలిచిన టీమ్ ఇండియా.. నమీబియా జట్టుతో జరిగే మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ గురువారం జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం ఖరారు అయినప్పటికీ.. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. నమిబియా జట్టుకు టీమిండియా పై గెలిచిన చరిత్ర ఇంతవరకు లేదు.
ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. నెదర్లాండ్స్ పాకిస్తాన్ జట్టును దాదాపు ఓడించినంత పని చేసింది. టీమిండియా కు అమెరికా చుక్కలు చూపించింది. ఇంగ్లాండ్ జట్టుకు నేపాల్ వెన్నులో వణుకు పుట్టించింది. దక్షిణాఫ్రికాకు ఆఫ్ఘనిస్తాన్ సినిమా చూపించింది. ఈ నేపథ్యంలో నమిబియాతో జరిగే మ్యాచ్ ను సులభంగా తీసుకోవద్దని టీమ్ ఇండియా ప్లేయర్లకు అభిమానులు సూచిస్తున్నారు.
నమిబియా జట్టుతో జరిగే మ్యాచ్ కు ముందు టీమిండియాకు షాకింగ్ పరిణామం ఎదురైంది. భీకరమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ కడుపునొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. అతడు డిశ్చార్జ్ అయినప్పటికీ నమీబియా జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆడతాడా? లేదా? అనే విషయాలపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పటికే జట్టులోకి వాషింగ్టన్ సుందర్ వచ్చేసాడు. మరోవైపు సంజు శాంసన్ కు కూడా పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ అభిషేక్ శర్మ పూర్తిగా ఫిట్ గా లేకపోతే అతడి స్థానంలో ఎవరిని ఆడిస్తారనేది చూడాల్సి ఉంది.
అభిషేక్ శర్మ కడుపునొప్పితో ఇబ్బంది పడుతుంటే.. టీమిండియా కు మరో చేదు పరిణామం ఎదురైంది. టీమిండియాలో ఇటీవల కాలంలో భీకరమైన ఆటగాడిగా పేరుపొందిన ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. నమిబియా జట్టుతో జరిగే మ్యాచ్ కోసం సన్నద్ధమవుతుండగా.. ప్రాక్టీస్ సెషన్ లో బుమ్రా వేసిన బంతి కిషన్ పాదానికి తగిలింది. దీంతో అతడు నొప్పితో అక్కడే కింద పడిపోయాడు. తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో నమీబియా తో జరిగే మ్యాచ్ లో అతడు ఆడేది అనుమానమేనని తెలుస్తోంది. బుమ్రా వేగంగా బంతిని విసరడంతో అది అదుపు తప్పి ఇషాన్ కిషన్ పాదానికి తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిలలాడిపోయాడు.. అయితే ఇషాన్ కిషన్ బాగానే ఉన్నాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి..
In the nets, Jasprit Bumrah bowled a delivery to Ishan Kishan that struck his foot very hard. The ball hit him with such force that Ishan fell to the ground in pain and was clearly struggling.
Bumrah seems to have a different intensity and ego while bowling, which is… pic.twitter.com/CwiFB5l0UL
— ⁴⁵ (@rushiii_12) February 11, 2026