T20 world cup: టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు.. కప్పు సాధించే ఛాన్స్ ఏ జట్టుకు ఉంది అన్నప్పుడు.. ఈ లిస్టులో టీం ఇండియా ముందు వరసలోనే ఉంది. టోర్నీ ప్రారంభమయ్యాక అంచనాలు ఓ మెట్టు పెరిగాయనే చెప్పాలి. వార్మప్ మ్యాచ్ లలో అంతగా అదరగొట్టింది మరి. కానీ.. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో, రెండో మ్యాచ్ లో న్యూజీలాండ్ చేతిలో ఘోర పరాభవం చవి చూడడంతో.. పరిస్థితి దారుణంగా తయారైంది. అభిమానుల నుంచి ఊహించని రీతిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ జరగనుంది. దీంతో.. ఎవరెవరు బరిలో దిగనున్నారు? ఎలాంటి ఫలితం సాధించనున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

పాకిస్తాన్ చేతిలో ఓటమితో దారుణ ఓటమితో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. న్యూజిలాండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోవడంతో డీలా పడిపోయింది. ఇలాంటి పరిస్తితుల్లో.. ఆఫ్ఘన్ తో మ్యాచ్ లో ఎలా ఆడుతుందన్నదే అందరి సందేహం. ఎందుకంటే.. ఆఫ్ఘన్ ఆషామాషీగా ఏమీ లేదు. పాకిస్తాన్ ను ఓడించినంత పని చేసింది. రెండు విజయాలతో రెండో స్థానంలో ఉంది. కాబట్టి, తేలిగ్గా తీసుకోవడానికి లేదు. దీంతో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
గత మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించిన వ్యూహం బెడ్సికొట్టింది. తద్వారా తగిన మూల్యం చెల్లించుకున్న టీమిండియా.. ఆ తప్పిదాన్ని సరిదిద్దుకునే ఛాన్స్ ఉంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ గోల్డెన్ డక్ అవ్వడంతో రాహుల్ ఒత్తిడి గురై ఔటయ్యాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్ ఆరంభంలోనే ఔటవ్వడంతో.. రాహుల్ వేగంగా ఆడే తాపత్రయంలో వెనుదిరిగాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఈ వైఫల్యాన్ని అధిగమిస్తారో లేదో చూడాలి.
మూడో ప్లేస్ లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం ఖాయమే. నాలుగో ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ కోసం గత మ్యాచ్‌లో అతన్ని తప్పించి టీమ్‌మేనేజ్‌మెంట్ మూల్యం చెల్లించుకుంది. గాయం కారణంగానే అతన్ని పక్కనపెట్టామని చెప్పింది. అదే నిజమైతే.. ఇషాన్ కిషన్‌కే చాన్స్ దక్కనుంది. ఆ తర్వాత రిషభ్ పంత్ వచ్చే అవకాశం ఉంది. పాకిస్థాన్‌పై పర్వాలేదనిపించినా.. సహజ శైలిలో ఆడలేకపోతున్నాడు.
ఇక, హార్దిక్ పాండ్యాకు జట్టులో తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది అనుమానమే. పేరుకు ఆల్‌రౌండర్ కోటాలో ఉన్నా.. ఫాం లేక తంటాలు పడుతున్నాడు. కాబట్టి, పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే.. శ్రేయస్ కు చాన్స్ దక్కొచ్చు. ఇక, జడేజా బ్యాటింగ్‌లో పర్వాలేదనపిస్తున్నా.. బౌలింగ్ మాత్రం మరీ నాసిరకంగా మారింది. రాత్రి మ్యాచ్ కావడంతో ముగ్గురు పేసర్లతోనే టీమిండియా బరిలోకి దిగే చాన్స్ ఉంది. మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ తుది జట్టులో ఉంటారా? అన్నది చూడాలి. రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీపై వేటు పడటం ఖాయంగా కనిస్తోంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు..
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా/శ్రేయస్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులో ఉండొచ్చు.