
RRR Movie: రాజమౌళికి సినిమా సక్సెస్ ఫార్ములానే కాదు, సినిమా సినిమాకి ఎలా అంచనాలు పెంచాలి ? అలాగే పెరిగిన ఆ అంచనాలను ఎలా క్యాష్ చేసుకోవాలి ? అదే విధంగా అందరి అంచనాలను ఎలా అందుకోవడంలో కూడా రాజమౌళికి బాగా తెలుసు. అందుకే, దర్శకులందు రాజమౌళి వేరుగా నిలబడ్డారు. పేరు గడించారు. ఏది ఏమైనా జక్కన్న ఊహ భారీగా ఉంటుంది.
ఆ ఊహను నిజం చేసేందుకు ఆయన ఎంచుకునే ప్రక్రియ కూడా వినూత్నంగా ఉంటుంది. రాజమౌళి విజయానికి ముఖ్య కారణం.. ఆయన కుటుంబం అంటుంటారు, కానీ కాదు, అయన విజయానికి కారణం ఆయనే. ఒక సినిమా బెస్ట్ అవుట్ ఫుట్ కోసం ఎంత కాలమైనా కష్టపడటానికి సిద్ధంగా ఉంటాడు. పైగా ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటాడు.
ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ ను తీసుకోడు, తన మార్కెట్ ను పట్టించుకోడు. సినిమా అవుట్ ఫుట్ మాత్రమే చూస్తాడు అందుకే, రాజమౌళి తన సినిమా మేకింగ్ కి మూడేళ్లు సమయాన్ని ఖర్చు పెడతాడు. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కాడు. ప్రస్తుతం చేస్తోన్న “ఆర్ఆర్ఆర్”(RRR Movie) విషయంలో కూడా ఇదే పద్దతి ఫాలో అవుతున్నాడు.
పైగా నిన్న వదిలిన టీజర్ కూడా బాగా ట్రెండ్ అవుతోంది. జనాన్ని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజువల్స్ అదిరిపోయాయి. కాకపోతే, మొదటిసారి రాజమౌళి పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, తెలుగులో కాదు, హిందీ వెర్షన్ విషయంలో. అసలు రాజమౌళి వదిలిన ఈ టీజర్లో అసలు కథ ఏమిటి ? ఎందుకు కథ గురించి రాజమౌళి ఏమి చెప్పలేదు.
అలాగే ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం విజువల్స్ కోసమే సినిమా చూడాలి అంటే.. అంతకు మించిన విజువల్స్ ఇంగ్లీష్ సినిమాల్లో ఉంటాయి కదా ? అంటూ ఆర్ఆర్ఆర్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు హిందీ నెటిజన్లు.
Also Read: ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ పై హీరో రానా స్పందన.. కొత్త వివాదం