టీ20 వరల్డ్ కప్ లో అద్భుతాలు చోటుచేసుకుంటున్నాయి. సంచలనాలు నమోదవుతున్నాయి. సెమీస్ చేరుకోవాలంటే జట్ల మధ్య పోటీ తీవ్రమైంది. న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరుకోవడంతో గ్రూప్ 1, 2 లో ఏ జట్లు సెమీస్ కు చేరుకుంటాయో తెలియడం లేదు. సూపర్ 12 పోటీలకు నవంబర్ 6న తెరపడనుంది. రె ండు గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్ కు చేరుకోనున్నాయి. గ్రూప్ 1 నుంచి న్యూజిలాండ్ సెమీస్ కలలు నిజం చేసుకోగా శనివారం రోజు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లలో ఒకటి సెమీస్ కు చేరుకుంటాయి. ఆదివారం గ్రూప్ 2 నుంచి సెమీస్ కు చేరే జట్లు ఏవనే విషయం తేలిపోతుంది.

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. దాయాది దేశాల మధ్య పోరంటే భలే కిక్కు వస్తుంది. రెండు దేశాల అభిమానులు మ్యాచ్ చూసేందుకు ఎగబడతారు. సూపర్ 12 దశలో పోటీ పడి భారత్ నెగ్గింది. ప్రస్తుతం ఇండియా, పాక్ సెమీస్ రేసులో ఉన్నాయి. భారత్ తన ఆఖరి పోరులో నెగ్గితే సెమీస్ చేరుతుంది. పాకిస్తాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆఖరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ నెగ్గినా ఇరు జట్లు సెమీస్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.
గ్రూప్ 2 నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీస్ కు చేరాలంటే పాయింట్లు ఆధారంగానే జరుగుతుంది. ఆరు పాయింట్లతో ఇండియా పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, పాకిస్తాన్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక ఇండియా ఆఖరి మ్యాచ్ జింబాబ్వేతో గెలిచినా వర్షం కారణంతో రద్దయినా సెమీస్ కు చేరడం ఖాయం. పాకిస్తాన్ సెమీస్ చేరుకోవాలంటే మాత్రం దక్షిణాఫ్రికా తన ఆఖరి మ్యాచ్ లో నెదర్లాండ్ చేతిలో ఓడిపోవాలి.
బంగ్లాదేశ్ పై పాకిస్తాన్ నెగ్గాలి. దీంతో భారత్ గ్రూప్ టాపర్ హోదాలో ఉంది. పాకిస్తాన్ ఆరు పాయింట్తతో గ్రూప్ రన్నరప్ గా సెమీఫైనల్ చేరుతుంది. సెమీఫైనల్ లో గ్రూప్ 1 జట్లతో జరిగే మ్యాచ్ ల్లో భారత్, పాక్ నెగ్గితే ఫైనల్ లో దాయాది దేశాలు పోటీ పడే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో భారత్, పాక్ మ్యాచ్ పై అందరిలో ఎంతో ఉత్సాహం నెలకొంది. కానీ వాటి మధ్య మ్యాచ్ జరుగుతుందో లేదో తెలియడం కష్టమే. దీంతో టీ20 వరల్డ్ కప్ లో ఏ దేశం ఏ దేశాన్ని ఓడిస్తుందో తెలియడం లేదు. ఏ అద్భుతాలు చోటుచేసుకుంటాయో కూడా అంతు చిక్కడం లేదు. ఇక సెమస్ లో చేరే దేశాలేవో ఆదివారం నాటి మ్యాచుల్లో బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.