IND vs ZIM : టీ20 వరల్డ్ కప్ లో కీలక సమరం ఆదివారం జరగనుంది. సెమీస్ బెర్త్ కావాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా నెగ్గాల్సిందే. దీంతో నేడు జరిగే ఆటలో జింబాబ్వేను ఓడించి సెమీస్ కు వెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న జట్లే కదా అని ఏమరుపాటుగా ఉంటే నష్టాలు చవిచూస్తున్నాయి. దీంతో జింబాబ్వేతో నేడు జరిగే సమరంపై అందరికి ఉత్కంఠ నెలకొంది. సూపర్ 12 దశ నుంచి సెమీస్ చేరాలంటే చెమటోడ్చక తప్పడం లేదు. గ్రూప్ 1లో ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ చేరడంతో ఇండియా కూడా జింబాబ్వేను ఓడించి సెమీస్ కు చేరుకోవాలని చూస్తోంది.

ఆదివారం జింబాబ్వేను ఓడిస్తే గ్రూప్ 2 నుంచి సెమీస్ కు వెళ్తుంది. దీంతో జింబాబ్వేను ఎలాగైనా ఓడించాలని వ్యూహాలు ఖరారు చేస్తోంది. బలహీనమైన జట్టు అనుకున్న లంకపై గెలవడానికి ఇంగ్లండ్ ఎంతో కష్టపడింది. బంగ్లాదేశ్ ను ఓడించడానికి కూడా ఇండియా ఎన్నో ఆపసోపాలు పడింది. ఈ నేపథ్యంలో జింబాబ్వేను తక్కువగా అంచనా వేయడం లేదు. ప్రపంచకప్ లో చిన్న జట్లే పెద్ద జట్లను ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో జింబాబ్వేతో మ్యాచ్ లో ఎలా నెగ్గాలనే డైలమాలో భారత్ పడుతోంది.
టీమిండియాలో ఆటగాళ్ల పర్ఫార్మెన్స్ సరిగా ఉండటం లేద. ఆటగాళ్ల పేలవమైన ప్రదర్శన ప్రత్యర్థి జట్టుకు అవకాశాలు ఇష్తోంది. దీంతో విజయాలు దోబూచులాడుతున్నాయి. ఓపెనర్ల వైఫల్యం బాధిస్తోంది. బంగ్లాదేశ్ పై మ్యాచ్ లో రాహుల్ ఫామ్ లోకి వచ్చినా రోహిత్ మాత్రం తన తడాఖా చూపించడం లేదు. ఫలితంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జట్టులోని ఆటగాళ్లను మార్చాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దినేష్ కార్తీక్, అశ్విన్, అక్షర్ పటేల్ ఎన్ని తప్పులు చేస్తున్నా వారినే కొనసాగిస్తున్నారు. దీంతో విజయాలు దక్కడం లేదు.
కార్తీక్, అశ్విన్ స్థానంలో పంత్, చాహల్ లను తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీంతో వారి ఫామ్ పై అనేక సందేహాలు వస్తున్ాయి. కెప్టెన్ రోహిత్, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఫామ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం నాటి మ్యాచ్ లో వీరు తప్పకుండా తమ విశ్వరూపం ప్రదర్శించి జట్టుకు విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జింబాబ్వేతో మ్యాచ్ చావో రేవో అన్నట్లుగా మారడంతో ఇక గెలుపొకటే మనకు శ్రీరామరక్షగా మారనుంది.
పెద్ద జట్టయినా చిన్న జట్టయినా విజయమే లక్ష్యం. జింబాబ్వే ను ఇండియా తక్కువగా అంచనా వేయడం లేదు. అందులో కూడా ఆల్ రౌండర్లు అదరగొడుతున్నారు. ప్రస్తుత టోర్నీలో రజా అత్యుత్తమ ప్రదర్శన చేస్తుండటంతో జింబాబ్వే ప్రత్యర్థులను భయపెడుతోంది. విలియమ్స్ కూడా నిలకడగా రాణిస్తుండటంతో కెప్టెన్ ఎర్విన్ కూడా తన బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తున్నాడు. బౌలింగ్ లో ముజరబాని, ఎంగర్వ, జాంగ్విలతో జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో ఆదివారం నాటి మ్యాచ్ లో జింబాబ్వేను ఓడించి సెమీస్ కు చేరుకోవాలని ఇండియా సర్వశక్తులు ఒడ్డనుంది.