Munugodu Bypoll KA Paul : వినూత్న ప్రచారం.. నామినేషన్ నుంచి పోలింగ్ రోజు వరకు ఆయన ఏది చేసినా.. వినూత్నమే.. అధికార టీఆర్‌ఎస్‌కు పంచ్ డైలాగ్ ఇచ్చినా.. బీజేపీ అభ్యర్థి రాజగోపాలరెడ్డిని ఆలింగనం చేసుకున్నా.. రైతు వేషంలో సైకిల్ తొక్కినా.. పోలీసులకు వార్నింగ్ ఇచ్చినా.. ఆయనకు ఆయనే సాటి. పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో పరిగెత్తుతూ ఆశ్చర్యపర్చారు.. పది వేళ్లకు పది ఉంగరాలు పెట్టుకుని పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఆశ్చర్య పర్చారు. నిబంధనలకు విరుద్ధం కదా అంటే.. ‘టీఆర్‌ఎస్ వాళ్లది కారు గుర్తు.. వాళ్లు సైకిల్‌పై వస్తున్నారా’ అని తనదైన శైలిలో సెటైర్ వేసి కేఏ.పాలా మజాకానా అని అనిపించుకున్నారు. తాజాగా కౌంటింగ్‌లోనూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

టీఆర్‌ఎస్, బీజేపీ హోరాహోరీ..
మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. ఇందులో ప్రత్యకంగా చెప్పుకోవాల్సి స్వతంత్ర అభ్యర్థి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్. ఓట్లు సాధించడంలోనూ పాల్ ప్రత్యేకతను చాటుకున్నారు. తొలి రౌండ్‌లో 34 ఓట్లు సాధించారు.
తొలి రౌండ్‌లోనే బోణీ..
పోలింగ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేఏ.పాల్ ఎన్నికల్లో తన విజయం ఖాయమైందన్నారు. మునుగోడు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 50 వేల ఓట్ల మెజారిటీతో తాను విజయం సాధించబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే అంతా కేఏ.పాల్‌కు కనీసం వంద ఓట్లు వచ్చినా చాలు అన్న భావనలో ఉన్నారు. మంత్రి కేటీఆర్ అయితే.. కేఏపాల్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జోకర్‌గా అభిప్రాయపడ్డారు. కానీ.. మునుగోడు కౌంటింగ్‌లో మాత్రం తొలి రైండ్‌లోనే పాల్ బోణీ కొట్టారు. 34 ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపర్చారు. రౌండ్ రౌండ్‌కూ ఓట్లు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.