T20 World Cup 2024: ఇండియా-పాక్ మ్యాచ్ తోపాటు టీమిండియా మ్యాచ్ లు న్యూయార్క్ లోనే ఎందుకు పెట్టారంటే..?

T20 World Cup 2024 యుఎస్ లో క్రికెట్ ని ప్రోత్సహించే విధంగా ఐసిసి తగు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంత వరకు యూఎస్ లో అసలు క్రికెట్ కి సంబంధించిన ఊసే ఉండేది కాదు.

Written By: Suresh, Updated On : January 18, 2024 1:34 pm

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: ప్రస్తుతం ప్రపంచం లో ఉన్న క్రికెట్ అభిమానులందరూ టి 20 వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు నాలుగు గ్రూపులుగా పాల్గొనబోతున్నాయి. ఇక అందులో భాగంగానే ఇండియా, పాకిస్తాన్ టీమ్ లు ఒకే గ్రూప్ లో ఉండబోతున్నాయి. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇండియా పాకిస్తాన్ టీమ్ ల మధ్య జరిగే మ్యాచ్ లకి ఉన్న క్రేజ్ మరే మ్యాచ్ లకు ఉండదనే విషయం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిందే… ఇక అందులో భాగంగానే ఈసారి కూడా ఈ మ్యాచ్ లను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం యుఎస్ లో క్రికెట్ ని ప్రోత్సహించే విధంగా ఐసిసి తగు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంత వరకు యూఎస్ లో అసలు క్రికెట్ కి సంబంధించిన ఊసే ఉండేది కాదు. కానీ ప్రస్తుత రోజుల్లో క్రికెట్ కి పెరుగుతున్న ఆదరణ ని దృష్టిలో ఉంచుకొని యుఎస్ కూడా తమ కంటూ ఒక క్రికెట్ టీమ్ ఉండాలనే ఆలోచన చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఐసీసీ కూడా వాళ్లకి సపోర్ట్ చేస్తూ అక్కడ క్రికెట్ కు సంబంధించిన వాతావరణాన్ని నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటూ వస్తుంది. నిజానికి యుఎస్ లో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇండియాకు సంబంధించిన మ్యాచ్ లను న్యూయార్క్, డల్లాస్ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది…

ఇక న్యూయార్క్ లో ఇండియా మూడు మ్యాచ్ లను ఆడే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే డల్లాస్ లో ఒక మ్యాచ్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి డల్లాస్ లో ఎక్కువ మ్యాచులు నిర్వహించవచ్చు కానీ అక్కడున్న స్టేడియం ఎక్కువ మంది ప్రేక్షకులు చూడ్డానికి అనుకూలంగా ఉండకపోవడం వల్లనే, అక్కడ ఎక్కువ మ్యాచ్ లు నిర్వహించలేక పోతున్నారు. ఇక ఈ గ్రౌండ్ కెపాసిటీ చాలా తక్కువ గా ఉంది. కేవలం 7500 మంది మాత్రమే మ్యాచ్ చూడటానికి అనుకూలంగా ఉండటం తో అక్కడ ఎక్కువ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం లేకుండా పోతుంది. ఇక ఇండియా మ్యాచ్ అంటే దాదాపు లక్ష మందికి పైన చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి డల్లాస్ లో ఇండియాకి చెందిన ఒక మ్యాచ్ ని మాత్రమే నిర్వహించనున్నట్టు గా తెలుస్తుంది. ఇక న్యూయార్క్ గ్రౌండ్ దాదాపు 35,000 మంది ప్రేక్షకులు చూడడానికి అనుకూలంగా ఉంటుంది. అయిన ఇండియా మ్యాచ్ కి ఈ స్టేడియం కూడా సరిపోదు కానీ యుఎస్ లో క్రికెట్ ని ప్రోత్సహించాలనే ఒకే ఒక ఉద్దేశ్యం తో ఐసీసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది…

అయితే న్యూయార్క్, డల్లాస్ లలో ఇంకా ఎక్కువ మ్యాచ్ లు నిర్వహించకపోవడానికి మరోక కారణం ఏంటి అంటే ఇక్కడ టైమ్ జోన్ కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇండియాలో మ్యాచ్ లు ప్రతి ఒక్కరు చూడ్డానికి ఇష్టపడుతుంటారు. టి 20 మ్యాచ్ లు ఎక్కువగా ఈవెనింగ్ 7:30 లేదా 8 కి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక యుఎస్ లో ఆడితే ఈ టైమ్ కి మ్యాచ్ లు ఆడటం కష్టం అవుతుంది. ఇక యుఎస్ లో ఆడితే ఈ టైమ్ కి ఇండియాలో తెల్లవారుజామున అవుతుంది. ఆ టైంలో మ్యాచ్ లు ఆడటం కష్టం అవుతుంది. అక్కడ రాత్రి, మనకు పగలు కావడంతోనే ఇండియాలో వ్యూయర్ షిప్ పై దెబ్బపడుతుంది. అందుకే అమెరికా, వెస్టిండీస్ లలో భారత మ్యాచ్ లకు స్పాన్సర్ల కొరత ఇన్నాళ్లు వెంటాడింది. కానీ ఇప్పుడు వరల్డ్ కప్ కావడంతో ఇండియాలో చూసే విధంగా అమెరికాలో ఉదయం మ్యాచ్ ల నిర్వహణ చేపడుతున్నారు. అందుకే ఇక్కడ ఎక్కువ మ్యాచ్ లు నిర్వహించలేకపోతున్నారు. ఇక మొత్తానికైతే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల క్రికెట్ టీమ్ లు కూడా ఈసారి టి20 వరల్డ్ కప్ ని అందుకోవడానికి చాలా ఉత్సాహన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది…