https://oktelugu.com/

T20 World Cup 2024: వారెవ్వా స్కాట్లాండ్.. ఏకంగా టాప్ లోకి..

156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 18.3 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. నమిబియా బౌలర్లలో ఏరాస్మస్ రెండు వికెట్లు తీశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 8, 2024 / 09:21 AM IST

    T20 World Cup 2024

    Follow us on

    T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అమెరికా జట్టు పాకిస్తాన్ ను ఓడించింది..ఒమన్ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది.. ఇప్పుడు ఆ కోవలోకే స్కాట్లాండ్ చేరింది. టీ 20 క్రికెట్లో అంతంత మాత్రమే అనుభవం ఉన్న ఈ జట్టు.. శుక్రవారం నమిబియాతో బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయంతో 3 పాయింట్లు సాధించి, గ్రూప్ “బీ” లో అగ్రస్థానానికి చేరుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో చెరువు పాయింట్ లభించింది.

    ఈ మ్యాచ్లో ముందుగా నమిబియా బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడిన నమీబియా జట్టును కెప్టెన్ గేర్హార్డ్ ఏరాస్మస్ అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. గ్రీన్ 28, డేవిన్ 20 పరుగులతో ఆకట్టుకున్నారు.. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్ వీల్ మూడు వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్లీ కర్రీ రెండు వికెట్లు సాధించాడు.

    156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 18.3 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. నమిబియా బౌలర్లలో ఏరాస్మస్ రెండు వికెట్లు తీశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో నమిబియా బౌలర్లు ప్రారంభంలో అద్భుతంగా బౌలింగ్ వేశారు. దీంతో పరుగుల కోసం స్కాట్లాండ్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ దశలో స్కాట్లాండ్ కెప్టెన్ బేరింగ్ టన్ 47*, లీస్క్ అద్భుతంగా ఆడారు. లీస్క్ చెలరేగి ఆడటంతో స్కాట్లాండ్ విజయం వైపు పరుగులు తీసింది. బేరింగ్టన్, లీస్క్ ఐదో వికెట్ కు ఏకంగా 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీంతో స్కాట్లాండ్ విజయాన్ని అందుకుంది.. ఈ విజయంతో ఏకంగా గ్రూప్ “బీ” టాప్ స్థానానికి చేరుకుంది.. ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో స్కాట్లాండ్ జట్టుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.