https://oktelugu.com/

T20 World Cup 2024 : టీమ్ ఇండియాకు ముంబై జట్టే దిక్కయిందా… టీ-20 కప్ గెలిచే సత్తా ఉందా?

టీమిండియా సెలక్టర్లు మాత్రం పవర్ ప్లే లో దొరికిపోతున్న రోహిత్ శర్మ లాంటి ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. జట్టు కూర్పులో ఎటువంటి వైవిధ్యం లేకుండా.. టి20 వరల్డ్ కప్ సాధన ఎలా సాధ్యమవుతుందో సెలెక్టర్లకే తెలియాలి.

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2024 / 08:11 PM IST

    Team India

    Follow us on

    T20 World Cup 2024 – Team India : టీ -20 వరల్డ్ కప్ కు అన్ని జట్లు యువకులను ఎంపిక చేస్తే.. భారత జట్టు మాత్రం సీనియర్లను నమ్ముకుంది. అది కూడా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ లో ఆడుతున్న నలుగురు కీలక ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. వారిలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరిలో బుమ్రా మాత్రమే బౌలింగ్ లో రాణిస్తున్నాడు. మిగతా ఆటగాళ్లు బ్యాటింగ్ లో తేలిపోతున్నారు. వాస్తవానికి సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కంటే కుర్రాళ్ళు ఐపీఎల్లో అద్భుతంగా ఆడుతున్నారు. మాయాంక్ యాదవ్, శశాంక్ సింగ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి వారు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. అలాంటివారికి బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. 2022లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో సెమీఫైనల్ లో ఓడిన భారత జట్టులో.. 8 మంది ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. వాస్తవానికి కొత్తదనానికి, యువకులకు అవకాశాలు కల్పించాల్సిన చోట.. పాత ఆటగాళ్లకు చోటు ఇచ్చి.. విమర్శలు వస్తాయనే నెపంతో యశస్వి జైస్వాల్, శివం దుబే వంటి వారిని తీసుకున్నారు.

    టి20 జట్టు లో కీలకంగా ఉన్న హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుత ఐపిఎల్ లో ఆశించినంత స్థాయిలో ఆడటం లేదు. రోహిత్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ వెంటనే అవుట్ అవుతున్నాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ కూడా అంతే.. తుఫాన్ ఇన్నింగ్స్ లాగా మొదలుపెట్టి.. ఆ తర్వాత వెంటనే దొరికిపోతున్నారు. హార్దిక్ పాండ్యా ది కూడా అదే పరిస్థితి. ముంబై జట్టులో కీలకంగా ఉన్న ఈ ఆటగాళ్లు.. ఇంతవరకు ఒక్క ఇన్నింగ్స్ కూడా గట్టిగా ఆడలేకపోయారు. సూర్య కుమార్ యాదవ్ 2 మ్యాచ్ లు మినహా.. మిగతా అన్నింటిలో తేలిపోయాడు. ఇంత గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ముంబై జట్టు పాయింట్ల పట్టికలో దిగువ స్థాయిలో కొనసాగుతోంది.

    ఇలాంటి ఫామ్ లో లేని ఆటగాళ్ల ఎంపిక ద్వారా సెలక్టర్లు ఎవరి మెప్పు పొందేందుకు తాపత్రయపడుతున్నారో అర్థం కాని ప్రశ్న. వాస్తవానికి ఈ ముగ్గురు ఆటగాళ్లు గొప్ప రికార్డు ఉన్నవాళ్లే. కానీ టి20 వరల్డ్ కప్ కు రికార్డుతో సంబంధం ఉండదు. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అనే సామెత తీరుగానే ఉంటుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ వంటి వాటిని అందించిన కమిన్స్ ను కాదనుకొని, ఆస్ట్రేలియా జట్టు మార్ష్ కు టి20 వరల్డ్ కప్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. టీమిండియా సెలక్టర్లు మాత్రం పవర్ ప్లే లో దొరికిపోతున్న రోహిత్ శర్మ లాంటి ఆటగాడికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. జట్టు కూర్పులో ఎటువంటి వైవిధ్యం లేకుండా.. టి20 వరల్డ్ కప్ సాధన ఎలా సాధ్యమవుతుందో సెలెక్టర్లకే తెలియాలి.