PUSHPA PUSHPA Song : ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఒక సినిమా మీద విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ సినిమా ఏంటి అంటే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప 2 ‘ అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ గా మొదటి లిరికల్ సాంగ్ ని ఈరోజు రిలీజ్ చేశారు. ఇక చంద్రబోస్ ఈ పాటని అద్భుతంగా రాశారు.
ఇక ఈ పాట లో మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి..అవి ఏంటి అంటే ఈ పాటలో మనకు పుష్ప టాలెంట్ గాని, ఆయన వ్యక్తిత్వాన్ని గాని చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక ముఖ్యంగా పుష్పని పంచభూతాలతో పోలుస్తూ ఆయన క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. పంచభూతాలకు కోపం వస్తే ఎలాంటి ప్రళయం అయితే జరుగుతుందో పుష్పకి కనక తిక్క రేగితే అలాంటి ప్రళయమే వస్తుంది అనేలా ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసారు.
ఇక ఈ సాంగ్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అల్లు అర్జున్ బెల్ట్ కి గోడ్డలి రూపంలో ఉండే ఒక ఇనుప కడ్డీతో చేసిన దాన్ని తన బెల్ట్ లో పెట్టారు. అంటే సినిమాలో కీలకమైన సమయంలో బెల్ట్ లో ఉన్న ఆ గొడ్డలిని కూడా పుష్ప వాడబోతున్నాడేమో అనేంతలా దాన్ని హైలెట్ చేశారు. ఇక అలాగే పుష్పకి ఎదురు ఎవడు నిలబడలేడు తను పేదాల మంచి కోరుకుంటూ ఒక నాయకుడిలా ముందుకు సాగబోతున్నాడు అనేది కూడా ఈ సాంగ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు…
అయితే పుష్ప తన సామ్రాజ్యానికి తనే అధిపతిగా ప్రకటించుకొని ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక శత్రువులుగా ఉన్నవారు తనను లొంగదీసే ప్రయత్నం అయితే చేస్తారు. మరి దాన్ని ఎదుర్కొని పుష్ప తన సామ్రాజ్యాన్ని ఎలా సంరక్షించుకుంటాడు అనేది మనకు సినిమాలో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ మొత్తాన్ని షేక్ చేస్తుందనే చెప్పాలి…