T20 World Cup 2022 India vs England: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఇండియా భారీ స్కోర్ సాధించింది. అచ్చికి వచ్చిన అడిలైడ్ మైదానంలో తనకు మెరుగైన రికార్డు ఉందని మరోసారి చాటుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ భారత జట్టు ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డారు. ఇదే క్రమంలో ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొంటు భారత బ్యాట్స్మెన్ పరుగులు చేశారు.

ఇన్నింగ్స్ ప్రారంభమైంది ఇలా
వరుస ఆఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న రాహుల్ విఫలమయ్యాడు. ఫామ్ లో ఉన్నట్టు కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులకే అవుట్ అయ్యాడు. ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి బాగా ఆడతాడు అనుకుని అభిమానుల్లో ఆశలు రేపిన సూర్య కుమార్ యాదవ్… వెంటనే ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 11.2 ఓవర్లలో 75 పరుగులు.. కీలకమైన మూడు వికెట్లు అప్పటికే కోల్పోయింది.. వరుసగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు.
ఇన్నింగ్స్ నిర్మించారు
హార్దిక్ క్రీజులోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే స్కోర్ బోర్డు కదలడం ప్రారంభమైంది. ఇరువురు కలిసి నాలుగో వికెట్ కు 61 పరుగులు జోడించారు.. ఇదే క్రమంలో కింగ్ విరాట్ కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఏ ఫార్మాట్లో అయినా అత్యధిక సెంచరీలు సాధించిన 5వ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. కీలక దశలో మెరుగైన ఇన్నింగ్స్ ఆడి భారత్ భారీ స్కోరు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత అవుట్ అయ్యాడు.

మెరిసిన హార్దిక్
విరాట్ కోహ్లీ ఔట్ అయిన తర్వాత రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఒక ఫోర్ ఒక సింగిల్ తీసి సౌకర్యవంతంగానే కనిపించాడు. కానీ హార్దిక్ తొందరపాటు వల్ల రన్ అవుట్ అయ్యాడు.. ఇదే దశలో హార్దిక్ పాండ్యా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి 63 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. మొత్తానికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.