T20 World Cup 2021 Final: టీ 20 ప్రపంచ కప్ లో ఫైనల్ లో ఆస్రేలియా, కివీస్ తలపడనున్నాయి. దీంతో సెమీస్ లో ఆస్రేలియా పాకిస్తాన్ ను చిత్తు చేసి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. ఇన్నాళ్లు టీ 20 ప్రపంచ కప్ కివీస్ ను ఊరిస్తున్నా ఇంతవరకు దక్కలేదు. దీంతో ఈసారి ఎలాగైనా కప్ గెలవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాలు ఖరారు చేస్తోంది. ఆస్రేలియాను నిలువరించాలని తలపిస్తోంది. ఎలాగైనా కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

2019 ప్రపంచ కప్ లో ఫైనల్ కి చేరినా అనివార్య కారణాల వల్ల కప్ ను చేజార్చుకుంది. ఈసారి మాత్రం కప్ ను ఎలాగైనా సాధించాలనే రంగం సిద్ధం చేసుకుంటోంది. దుబాయి ఇంటర్నేషనల్ వేదికగా ఫైనల్ మ్యాచ్ 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
కానీ ఇప్పుడు న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ పై పడింది. ఇంతవరకు కప్ సాధించని కివీస్ కు కప్ అందించడమే లక్ష్యంగా అతడు ముందుకు కదులుతున్నాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కప్ గెలవాలని ఇండియా అభిమానులు సైతం కోరుకుంటున్నారు. 2019 ఫైనల్ లో ఓటమి పాలైనా కేన్ విలియమ్సన్ చూపిన అభిమానం అందరిలో ఆసక్తి రేపింది.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ చూపిన తెగువకు కేన్ మామగా గుర్తింపు పొందాడు. దీంతో ప్రస్తుతం కివీస్ విజయం సాధించి కప్ గెలవాలని మన అభిమానులు సైతం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కివీస్ జట్టు ఫైనల్ లో ఆస్రేలియాను చిత్తు చేసి కప్ గెలిచి వారి దేశానికి కానుకగా అందివ్వాలని ఆటగాళ్ల కోరిక.
Also Read: న్యూజిలాండ్ vs ఆస్ట్రేలియా.. నువ్వా నేనా..? ఫైనల్ లో గెలుపెవరిది?