Suryakumar Yadav: మరోసారి ఫెయిల్ అయిన సూర్య కుమార్…ఇతన్ని వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేసి తప్పు చేశారా..?

ఎప్పటినుంచో చాలామంది సూర్యకుమార్ యాదవ్ వన్డే ఇన్నింగ్స్ లా పట్ల నెగిటివ్ అభిప్రాయం తో ఉన్నప్పటికీ బిసిసిఐ ఆయనకు ఎక్కువగా అవకాశాలను ఇస్తూ అతన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది.

Written By: Gopi, Updated On : September 16, 2023 9:48 am

Suryakumar Yadav

Follow us on

Suryakumar Yadav: ఇక ఏషియా కప్ లో భాగంగా సూపర్ ఫోర్ లో ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కి హార్దిక్ పాండ్యా కి రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక వీళ్ళ ప్లేస్ లో తిలక్ వర్మ , సూర్య కుమార్ యాదవులకు తుది జట్టు లో అవకాశం కల్పించారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి.వీళ్ళు ఫెయిల్ అవ్వడం వల్ల బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న జట్టు మీద కూడా ఇండియా ఒడిపోవాల్సి వచ్చింది.ఇక తిలక్ వర్మ విషయం పక్కన పెడితే సూర్య కుమార్ యాదవ్ కి ఇప్పటికే వన్డేల్లో చాలా అవకాశాలు ఇచ్చారు అయిన కూడా ఆయన ఏ ఒక్క మ్యాచ్ లో కూడా తనదైన ఒక భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు.ఇక ఈరోజు జరిగిన మ్యాచ్ లో తనని తాను ప్రూవ్ చేసుకొని మ్యాచ్ ని గెలిపిస్తాడు అని అందరూ అనుకున్నారు.కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎప్పటిలాగే సూర్య కుమార్ యాదవ్ ఎక్కువ స్కోర్ చేయలేకపోయాడు.

ఎప్పటినుంచో చాలామంది సూర్యకుమార్ యాదవ్ వన్డే ఇన్నింగ్స్ లా పట్ల నెగిటివ్ అభిప్రాయం తో ఉన్నప్పటికీ బిసిసిఐ ఆయనకు ఎక్కువగా అవకాశాలను ఇస్తూ అతన్ని ప్రోత్సహిస్తూ వస్తుంది. అయిన కూడా ఆయన తన స్థాయి పర్ఫామెన్స్ అయితే ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ లో కూడా ఇవ్వలేకపొతున్నాడు. సూర్య టి20 ఫార్మాట్లో నెంబర్ వన్ ప్లేయర్ అయినప్పటికీ వన్డేలో మాత్రం అంత మంచి ఫామ్ లో లేడు అనే చెప్పాలి. వన్డే మ్యాచ్ లు ఆడటానికి ఆయన చాలా ఇబ్బంది పడుతూ గ్రౌండ్ లో బౌలర్లను ఎదుర్కోవడంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు.ఇక ఇలాంటి పరిస్థితుల్లో సూర్య కుమార్ యాదవ్ ని వరల్డ్ కప్ టీం కి సెలెక్ట్ చేసి బీసీసీఐ చాలా పెద్ద తప్పే చేసిందంటూ చాలామంది సీనియర్ ప్లేయర్లు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సంజు సాంసన్ లాంటి ప్లేయర్లకి అవకాశాన్ని ఇవ్వకుండా సూర్య కుమార్ యాదవ్ కి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం పట్ల చాలామంది బీసీసీఐ మీద తీవ్రమైన నెగిటివ్ అభిప్రాయంతో ఉన్నారు. నిజానికి వన్డే ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ కంటే సంజు సాంసన్ చాలా బెటర్… సాంసన్ వన్డే యావరేజ్ కూడా దాదాపు 50 ఎబోవ్ గా ఉంది. ఇక ఇలాంటి మంచి ప్లేయర్ ను వదిలేసి వరల్డ్ కప్ కి సూర్యకుమార్ యాదవ్ లాంటి ఒక ఫామ్ లో లేని ప్లేయర్ ను సెలెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బీసీసీఐ కి క్రికెట్ మేధావులు సైతం సూటిగా ప్రశ్నలు వేస్తున్నారు…