Homeక్రీడలుక్రికెట్‌IND Vs PAK Usman Tariq: అక్రమ్ కాదు.. అక్తరూ కాదు.. ఉస్మాన్ తారిఖ్ కు...

IND Vs PAK Usman Tariq: అక్రమ్ కాదు.. అక్తరూ కాదు.. ఉస్మాన్ తారిఖ్ కు ఇన్స్పిరేషన్ ఇండియన్ క్రికెటర్! ఇంతకీ ఎవరతను?

IND Vs PAK Usman Tariq: టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్, టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అతడు అత్యంత వివాదాస్పదమైన బౌలర్ గా ఆవిర్భవించాడు.

ఉస్మాన్ తారిఖ్ ఆడింది కేవలం 4 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు మాత్రమే. పైగా ఇతడి వయసు 28 సంవత్సరాలు. అంత గొప్పగా రికార్డులు కూడా లేని ఇతని గురించి ఈ స్థాయిలో చర్చ జరగడానికి ప్రధాన కారణం ఉంది..

క్రికెట్ లో చాలామంది బౌలర్లు భిన్నంగా బౌలింగ్ వేస్తుంటారు. వారంతా కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. ఐసీసీ నిర్వహించిన పరీక్షల్లో విజయవంతమయ్యారు. అయితే వారి బౌలింగ్ మీద ఆ తదుపరి వివాదాలు ఏర్పడకపోవడానికి ప్రధాన కారణం.. బంతి వేసే క్రమంలో వారు ఆగకపోవడమే.

ఉస్మాన్ తారిఖ్ బంతిని వేస్తున్నప్పుడు ఒక క్షణం ఆగుతాడు. ఆ తర్వాత గురి చూసి బంతిని విసిరేస్తుంటాడు. ఈ క్రమంలో క్రీజ్ లో ఉండే బ్యాటర్ ఇబ్బంది పడుతుంటాడు. అయోమయానికి గురై వికెట్ సమర్పించుకుంటాడు.

ఇటీవల పాకిస్తాన్లో ఆస్ట్రేలియా జట్టు పర్యటించింది. ఆ సమయంలో ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ అర్థం కాక ఆస్ట్రేలియా బ్యాటర్లు చూస్తూ ఉండిపోయారు. మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా ఒక్క విజయం కూడా సొంతం చేసుకోలేకపోయింది.

ఉస్మాన్ తారిఖ్ ఈ స్థాయిలో బౌలింగ్ వేయడానికి ప్రధాన కారణం వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ కాదు. అతడిని ప్రభావితం చేసింది టీమ్ ఇండియా లెజెండ్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని. ఉస్మాన్ తారిఖ్ దుబాయ్ లో సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ ఉండేవాడు.

2016లో ధోని నిజ జీవితం ఆధారంగా “ధోని” అనే సినిమా రూపొందింది. ఆ సినిమాను ఉస్మాన్ తారిఖ్ దుబాయ్ లో వీక్షించాడు. ఆ తర్వాత అతడు ఆట మీద మళ్లీ మనసు లగ్నం చేశాడు. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఉస్మాన్ వయస్సు కేవలం 18 సంవత్సరాలు…

ఆట మీద మనసు లగ్నం చేసి.. కరేబియన్ క్రికెట్ లీగ్ లో సత్తా చూపించాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ అతడిని జాతీయ జట్టులోకి తీసుకుంది. ఉస్మాన్ పొడుగ్గా ఉంటాడు. నాలుగు అంతర్జాతీయ క్రికెట్ t20 మ్యాచ్లలో ఆడాడు. 5.93 ఎకానమీ ద్వారా ఏకంగా 11 వికెట్లు సొంతం చేసుకున్నాడు.

తన బౌలింగ్ ద్వారా టి20 క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్లుగా ముద్రపడిన డేవాల్డ్ బ్రేవిస్, రిజా హెడ్రిక్స్, గ్రీన్ వంటి వారిని అవుట్ చేశాడు. ఇక ఇప్పటివరకు ఉస్మాన్ 42 t20 లలో 74 వికెట్లు పడగొట్టాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version