Homeక్రీడలుక్రికెట్‌Suryakumar Yadav baby girl news: పెళ్లయిన పదేళ్లకు.. సూర్య కుమార్ యాదవ్ డబుల్ హ్యాపీ

Suryakumar Yadav baby girl news: పెళ్లయిన పదేళ్లకు.. సూర్య కుమార్ యాదవ్ డబుల్ హ్యాపీ

Suryakumar Yadav baby girl news: టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డబుల్ హ్యాపీనెస్ వచ్చేసింది. ఆయన తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో అతడి అభిమానులు.. తోటి ప్లేయర్లు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఆనందం కలకాలం వర్ధిల్లాలని అతడికి దీవెనలు అందిస్తున్నారు.

సూర్య కుమార్ యాదవ్ సతీమణి పేరు దేవిషా శెట్టి. వీరిది ప్రేమ వివాహం. 2016లో వీరికి కళ్యాణం జరిగింది. దేవిష ఉన్నత విద్యావంతురాలు. గతంలో ఆమె ఉద్యోగం చేశారు. వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైన తర్వాత.. చాలాకలం ప్రేమలో ఉన్న తర్వాత.. వారిద్దరు తమ వైవాహిక జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అందులో భాగంగానే పెళ్లి చేసుకున్నారు. 2016లో వీరికి కళ్యాణం జరిగింది. కెరియర్.. ఇతర కారణాల వల్ల పిల్లలు కనడాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.. అయితే ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ కెరియర్ పీక్స్ లో ఉంది.. 2024లో టి20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాలో అతడు కీలక ఆటగాడు. 2026లో అతని ఆధ్వర్యంలోనే టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఇంతకంటే గొప్ప సందర్భం ఉండదని సూర్యకుమార్ భావించాడు.

ఈ నేపథ్యంలోనే దేవిశా గర్భవతి అయింది. గురువారం ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీంతో అందరూ సూర్య కుమార్ యాదవ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆడపిల్లకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నామని తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్ల జన్మించడంతో సూర్యకుమార్ యాదవ్ కుటుంబంలో డబుల్ హ్యాపీనెస్ వచ్చినట్టు అయింది. ప్రస్తుతం సూర్య కుటుంబం ఆస్పత్రిలో ఉంది. సతీమణి పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో సూర్య ఆనందానికి అవధులు లేవు.

సూర్య కుమార్ యాదవ్ ఐపిఎల్ లో ముంబై జట్టులో ఆడుతున్నాడు. ఇటీవల తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు విజయం సాధించింది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలోనే ముంబై జట్టు విజయం సాధించడంతో అతని మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. దానికి తోడు ఆడపిల్ల జన్మించడంతో సూర్య కుమార్ యాదవ్ ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుతం ఆడపిల్ల పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని సూర్య ఆ బంగారు క్షణాలను ఆస్వాదిస్తున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version