Surya Kumar Yadav: క్రీజ్ లోకి రావడమే ఆలస్యం.. బంతిమీద ప్రతాపం చూపిస్తాడు. బౌలర్ మీద ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. స్టేడియంలో బౌండరీల మోత మోగిస్తాడు. తొలి బంతి నుంచే పరుగుల వరద పారిస్తాడు. స్టేడియం చుట్టూ బంతిని తరలిస్తాడు. అందువల్లే అతడిని మిస్టర్ 360 అని పిలుస్తారు. అయితే అటువంటి సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు తన ప్రతాపం చూపించడం లేదు. మైదానంలో ఆ మెరుపులు మెరిపించడం లేదు. ఫామ్ లేకపోవడంతో అనేక రకాలుగా తంటాలు పడుతున్నాడు. అతడు ఫామ్ కోల్పోవడం పై రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ మేనేజ్మెంట్ అవకాశాలు ఇస్తూనే ఉంది. ఇక టి20 వరల్డ్ కప్ 2026 కు పెద్దగా సమయం లేదు. మరో మూడు నెలల లోనే ఈ టోర్నీ జరగనుంది. అప్పటివరకు సూర్య కుమార్ యాదవ్ తన పాత లయను అందుకోవాలి. దీనికోసం ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ ను అతడు ఉపయోగించుకోవాలి. ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.
Also Read: రవితేజ వల్లే మా తమ్ముడు కార్తీ కెరియర్ నిలబడింది : సూర్య…
సారధిగా సూర్య కుమార్ యాదవ్ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు. గత ఏడాది టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. సూర్య కుమార్ యాదవ్ టి20 పగ్గాలు అందుకున్నాడు. ఇప్పటివరకు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా ఇంతవరకు సిరీస్ కోల్పోలేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మీద టీమిండియా టి20 సిరీస్ లు సాధించింది. ఇటీవల ఆసియా కప్ కూడా అందుతుంది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీం ఇండియా 29 టీ 20 మ్యాచ్ లు ఆడగా.. ఇందులో 25 విజయాలు సొంతం చేసుకుంది. కేవలం నాలుగు మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. సారధిగా సూర్య కుమార్ యాదవ్ కు ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా గడ్డమీద సారధిగా మాత్రమే కాకుండా, ఆటగాడిగా కూడా సత్తా చూపించాలని అభిమానులు భావిస్తున్నారు.
సారధిగా అదరగొడుతున్నప్పటికీ.. ఆటగాడిగా సూర్య విఫలమవుతున్న తీరు అనేక విమర్శలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో అతడు గొప్పగా ఆడాలని అభిమానులు కోరుతున్నారు. కెప్టెన్సీ వల్ల అతడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రీజ్ లో సరిగా నిలబడలేకపోతున్నాడు. గత ఏడాది అక్టోబర్లో తన చివరి హాఫ్ సెంచరీ చేశాడు. చివరి 14 ఇన్నింగ్స్ లలో అతడి స్కోరు 47 మాత్రమే. మూడుసార్లు 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆరుసార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్లో ఆరు ఇన్నింగ్స్ లలో కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు. సూర్య ఇలా విఫలం కావడానికి అతడి కెప్టెన్సీ నే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ అయిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అతడు వరుసగా నిరాశ పరుస్తూ జట్టుకు భారంగా మారుతున్నాడు. మరోవైపు వన్డే, టెస్ట్ పగ్గాలు అందుకున్న.. త్వరలోనే టీ 20 బాధ్యతలు స్వీకరిస్తాడని ప్రచారం జరుగుతోంది. కాబట్టి సారధిగా నిరూపించుకున్న సూర్య కుమార్ యాదవ్.. ఆటగాడిగా కూడా సత్తా చాటాల్సి ఉంది.