CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) మరోసారి తన చతురతను చాటుకున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో చంద్రబాబుకు జాతీయస్థాయిలో మంచి పేరు ఉంది. 1999లో శ్రీకాకుళం జిల్లాలో సూపర్ సైక్లోన్ నుంచి నేటి మొంథా తుఫాన్ వరకు ఆయన చర్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆయన పనితీరును బయటపెట్టాయి. రాజకీయంగా చంద్రబాబును విభేదించిన వారు ఉంటారు. కానీ ఆయన పనితీరుకు ప్రత్యర్థులు సైతం ఫిదా అవుతారు. నిత్య విమర్శకులు సైతం ఆయనలో ఉన్న గొప్పతనాన్ని చెబుతుంటారు. అయితే ఏపీలో మాత్రం వైసిపి నేతల పరిస్థితి విచిత్రంగా ఉంటుంది. వారి మాటలను పక్కన పెడితే.. తాజాగా చంద్రబాబు ఏకధాటిగా 12 గంటలపాటు తుఫాన్ సహాయ చర్యలపై సమీక్షలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే ఉన్నారు. అంతకు ముందు రోజు సైతం సచివాలయంలోనే గడిపారు.
* 11:30 తర్వాత ఇంటికి సీఎం..
మొంథా తుఫాన్(Monthaa cyclone) ఏపీని తీవ్రంగా వణికించింది. మచిలీపట్నం, కాకినాడ మధ్య నరసాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటలకు తీరాన్ని దాటింది. అటు తరువాత బలహీనపడింది. అయినా సరే ఏపీకి అత్యంత భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. అయితే సోమవారం అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే ఉండి సహాయక చర్యలపై సమీక్షించారు చంద్రబాబు. మంగళవారం ఉదయం సైతం సచివాలయానికి వచ్చి అర్ధరాత్రి వరకు గడిపారు. తుఫాను ప్రభావం ఉన్న అన్ని గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బందితో ఆర్టిజిఎస్ నుంచి టెలికాన్ఫెరెన్స్ చేపట్టారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు విరామం లేకుండా పరిస్థితిని సమీక్షించారు. మూడుసార్లు ఆర్టిజిఎస్ కు వచ్చారు. సమీక్షలతో పాటు రెండుసార్లు టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించారు. చివరకు రాత్రి 11:30 గంటల తరువాత చంద్రబాబు ఇంటికి బయలుదేరు వెళ్లారు.
* రాత్రంతా సచివాలయంలోనే లోకేష్..
మరోవైపు మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh) రాత్రంతా సచివాలయంలోనే ఉండిపోయారు. అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులకు విద్యుత్తు అస్తవ్యస్తంగా మారింది. చెట్లతో పాటు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ అన్ని జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రభుత్వ ముందస్తు చర్యలతోనే చాలావరకు నష్టం జరగలేదు. ప్రధానంగా ప్రాణ నష్టం నియంత్రించడంలో ప్రభుత్వం విజయవంతం అయింది. అయితే చంద్రబాబు వరుసగా రెండు రోజులపాటు అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే ఉండిపోయారు. ఏడు పదుల వయస్సులో ఆయన చేస్తున్న పని అందరికీ ఫిదా గా మారింది.