Shreyas Iyer: సూర్య సక్సెస్ అయ్యాడు,మరి శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి ఏంటి..?

అయితే ఇప్పటికే వీళ్ళందరూ వరల్డ్ కప్ టీంలో సెలెక్ట్ అయినప్పటికీ ఇందులో నుంచి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో జరిగే మ్యాచ్ లో వీళ్లని అడించాలని చూస్తున్నారు.

Written By: Gopi, Updated On : September 23, 2023 9:33 am

Shreyas Iyer

Follow us on

Shreyas Iyer: ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో మన యంగ్ ప్లేయర్స్ అందరూ అదరగొట్టారు.దాంతో ఆస్ట్రేలియాని ఓడించి ఇండియా గణ విజయం సాధించింది. ఇప్పుడు ఇండియా టీం లో అందరూ కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్లేయర్ల లో సూర్య కుమార్ యాదవ్, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటివారు వరల్డ్ కప్ లో మాత్రం బెంచులకు పరిమితం కానున్నారు. దాంతో వీళ్లను కూడా ఏదో ఒక మ్యాచ్ లో ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశ్యంతో ఇవాళ్ల ఆడిన మొదటి మ్యాచ్ లో మొత్తం ఈ ప్లేయర్లకే అవకాశాలు ఇవ్వడం జరిగింది.అందులో సూర్య కుమార్ యాదవ్ మహమ్మద్ షమీ లాంటి ప్లేయర్లు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని వరల్డ్ కప్ ఆడటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని మన సెలెక్టర్లకి ఒక సంకేతాన్ని పంపించారు.

అయితే ఇప్పటికే వీళ్ళందరూ వరల్డ్ కప్ టీంలో సెలెక్ట్ అయినప్పటికీ ఇందులో నుంచి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో జరిగే మ్యాచ్ లో వీళ్లని అడించాలని చూస్తున్నారు. ఇక ఈ పరీక్షలో సూర్య కుమార్ యాదవ్ ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే కానీ, శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఎటు అర్థం కావడం లేదు. నిన్న జరిగిన మ్యాచ్ లో తను అనవసరంగా రన్ అవుట్ అయ్యాడు అలా అవ్వకుండా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండగలిగితే తను కూడా ఫామ్ లో ఉన్నాడా లేదా అనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చేది. దాంతో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ బాగానే ఆడుతున్నాడు కాబట్టి మళ్ళీ శ్రేయాస్ అయ్యర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా రెండో వన్డే మ్యాచ్ లోశ్రేయస్ అయ్యర్ తనదైన రీతిలో మంచి పర్ఫామెన్స్ ఇస్తేనే గాని లేకపోతే తనని వరల్డ్ కప్ టీంలో బెంచ్ కే పరిమితం చేస్తారు. ఇక ఇప్పటికే సూర్య,షమీ ఇద్దరు కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ ,అశ్విన్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది.అందుకే రెండో వన్డేలో చాలా బాగా ఆడితేనే కానీ లేకపోతే వీళ్ళు ఇండియన్ వరల్డ్ కప్ టీమ్ లో మ్యాచ్ లు ఆడటం కష్టమనే చెప్పాలి…