Surya Kumar Yadav: ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఈరోజు జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఇండియా ఘనవిజయం సాధించడం జరిగింది. అయితే మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియా టీం నిర్ణీత 50 ఓవర్లకి 276 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.ఇక మన బౌలర్లలో మొహమ్మద్ షమి 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియా టీం భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేయడంలో అతను కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. ఇక 277 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ ప్లేయర్లు ఓపెనర్ల రూపంలో మంచి ఆరంభం అయితే వచ్చింది.ఇక ఇద్దరు ఓపెనర్లు కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చి ఇండియా టీం విజయం లో కీలక పాత్ర వహించారనే చెప్పాలి. ఇక ఇద్దరు ఓపెనర్లు అయిన రుతురాజ్ గైక్వాడ్ , శుభమన్ గిల్ ఇద్దరు కూడా మొదటి వికెట్ కి 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.ఇక మొదటగా 71 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ని అడెమ్ జంపా అవుట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత 74 పరుగులు చేసిన శుభమన్ గిల్ ని కూడా ఆడం జంపానే అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా మిస్ కమ్యూనికేషన్ వల్ల రన్ ఔట్ అయి తొందరగానే వెనుతిరిగాడు అయినప్పటికీ క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్ , కే ఎల్ రాహుల్ ఇద్దరూ కూడా కొద్దిసేపు బాగా ఆడుతూ స్కోర్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అంతలోనే ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడం జరిగింది. ఇక అప్పుడు క్రిస్ లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్, కేల్ రాహుల్ తో కలిసి ఒక మంచి ఇన్నింగ్స్ అడడానే చెప్పాలి.ఈ మ్యాచ్ లో 50 పరుగులు చేసి చాలా రోజుల తర్వాత హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. ఇక అతనితోపాటు కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. దాంతో ఇండియా 49 ఓవర్లు పూర్తి అవ్వకముందే ఐదు వికెట్లు నష్టపోయి 281 పరుగులు సాధించి ఆస్ట్రేలియా పైన మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన మహమ్మద్ షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు…
ఇక ముంతకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే మ్యాచుల్లో మూడు సార్లు కూడా సూర్య కుమార్ యాదవ్ డక్ ఔట్ అయ్యాడు.దాంతో ఈరోజు ఆస్ట్రేలియా టీమ్ మీద రివెంజ్ తీర్చుకున్నాడు… మ్యాచ్ కి కీలకమైన సమయంలో బ్యాటింగ్ లోకి వచ్చి మ్యాచ్ పొజిషన్ ని అంచనా వేస్తూ చాలా బాగా ఆడి మ్యాచ్ విజయం లో కీలక పాత్ర పోషించాడు. ఇతని కి బీసీసీఐ ఇన్ని రోజుల నుంచి చాలా అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాడు కానీ ఇవాళ్టి మ్యాచ్ లో మాత్రం మంచి పర్ఫామెన్స్ ఇచ్చి తను ఫామ్ లో ఉన్నాను అని అందరికీ తెలియజేశాడు… దీంతో వరల్డ్ కప్ లో సూర్య కుమార్ యాదవ్ ని కొన్ని మ్యాచ్ లకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి…