Suresh Raina: టీమిండియా ఇటీవల కాలంలో సూపర్ ఫామ్ లో ఉంది. సుదీర్ఘ ఫార్మాట్ ను కాస్త పక్కన పెడితే.. పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొడుతోంది. 2024లో టి20 వరల్డ్ కప్ అందుతుంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ రెండు టోర్నీలలో కూడా టీమిండియా రోహిత్ నాయకత్వంలోనే అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జట్టులో అనేక రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. పొట్టి ఫార్మాట్ కు రోహిత్ వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు. పైగా ఇప్పుడు అతని వయసు 37 సంవత్సరాలకు చేరుకుంది.. రోహిత్ మాదిరిగానే ఆ స్థాయిలో టీమిండియా మీద ప్రభావం చూపించిన మరో ఆటగాడు విరాట్ కోహ్లీ. శరీర సామర్థ్యం విషయంలో అద్భుతమైన ప్రమాణాలను నెలకొల్పుతున్నప్పటికీ.. విరాట్ విషయంలో మేనేజ్మెంట్ అంతగా ఆసక్తి ప్రదర్శించడం లేదని ఇటీవల కాలంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
పొట్టి ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ నుంచి విరాట్ తప్పుకున్నాడు. రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్న తర్వాత విరాట్ అతని స్థానాన్ని ఆశించాడు. మేనేజ్మెంట్ ఒప్పుకోకపోవడంతో అతడి కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం విరాట్ కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే గడిచిన వరల్డ్ కప్ లో విరాట్ అద్భుతమైన ఫామ్ కొనసాగించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో విరాట్, రోహిత్ విషయంలో అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే జట్టులో యంగ్ ఆటగాళ్లు విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ సిరీస్ తో అది బయటపడింది. దీంతో మేనేజ్మెంట్ కూడా ఆలోచనలో పడింది. జాతీయ మీడియా వర్గాల ప్రకారం మరో రెండేళ్లలో సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగే ప్రపంచ కప్ కు యంగ్ ఇండియాను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై సురేష్ రైనా తనదైన వ్యాఖ్యానాన్ని జోడించాడు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అతడు 2027 వరల్డ్ కప్ విషయంలో టీమిండియా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? ముఖ్యంగా రోహిత్, విరాట్ విషయంలో ఎలాంటి పాత్రను పోషించాలి? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. టీమిండియాలో యువ ఆటగాళ్లు ఉండటం మంచిదే అయినప్పటికీ.. అనుభవం ఉన్న రోహిత్, విరాట్ ను ఏ మాత్రం విస్మరించకూడదని రైనా వ్యాఖ్యానించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో స్ఫూర్తిని నింపడంలో వీరిద్దరూ సిద్ధహస్తులని.. గతంలో అనేక టోర్నీలలో ఇది నిరూపితమైందని రైనా వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా పిచ్ లు విభిన్నంగా ఉంటాయని.. అలాంటి చోట అన్ని రకాల అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. రోహిత్, విరాట్ దిగ్గజ ఆటగాళ్ళు అని.. వయసును సాకుగా చూపించి వారిద్దరినీ దూరంగా పెట్టొద్దని రైనా వ్యాఖ్యానించాడు. అన్ని విధాలుగా జట్టును రూపొందించాలని.. కేవలం “యంగ్” అనే మంత్రాన్ని జపిస్తే ఉపయోగముండదని పేర్కొన్నాడు.