Prabhas: ప్రభాస్ సినిమా కోసం సూసైడ్ లేటెస్ట్ రాసిన అభిమాని.. కారణం?

Prabhas: సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు.అభిమానం అంటే వారి సినిమాలు విడుదల అవుతున్నప్పుడు వారి కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం ద్వారా వారి అభిమానాన్ని బయట పెడుతూ ఉంటారు. అయితే ఏకంగా హీరో సినిమా కోసం సూసైడ్ చేసుకోవడం మీరు ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ప్రభాస్ అభిమాని ఏకంగా తన సినిమా రాధేశ్యామ్ అప్డేట్ కోసం సూసైడ్ లెటర్ రాయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే […]

Written By: Navya, Updated On : November 12, 2021 2:23 pm
Follow us on

Prabhas: సాధారణంగా సినిమా హీరోలకు అభిమానులు ఉంటారు.అభిమానం అంటే వారి సినిమాలు విడుదల అవుతున్నప్పుడు వారి కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం ద్వారా వారి అభిమానాన్ని బయట పెడుతూ ఉంటారు. అయితే ఏకంగా హీరో సినిమా కోసం సూసైడ్ చేసుకోవడం మీరు ఎప్పుడైనా విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ప్రభాస్ అభిమాని ఏకంగా తన సినిమా రాధేశ్యామ్ అప్డేట్ కోసం సూసైడ్ లెటర్ రాయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఆ అభిమాని లెటర్ రాస్తూ ఇప్పటివరకు నా జీవితంలో ఒక లెటర్ కూడా రాయలేదు.. కానీ ఇలా సూసైడ్ లెటర్ రాస్తానని ఎప్పుడూ కూడా ఊహించలేదు. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్నటువంటి రాధేశ్యామ్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎంతో నిరాశ చెందాను. ఇకపై ఎదురుచూడటం నా చేత కాదు నేను చస్తే ఈ సినిమా నుంచి అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నాను. అయితే నా చావుకు కారణం పూర్తిగా యు.వి.క్రియేషన్స్ నిర్మాతలు, దర్శకుడు రాధాకృష్ణ అంటూ సూసైడ్ లెటర్ రాయడం తో ఈ లెటర్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ విషయం తెలిసిన సదరు నెటిజన్లు కొంతవరకు ఆశ్చర్యం వ్యక్తం చేసిన సదరు నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోలపై అభిమానం ఉండాలి కానీ మరి ఇలా ఆత్మహత్య చేసుకొనేంత ఉండకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్ డేట్ ఇచ్చారు తప్ప తర్వాత ఈ సినిమా నుంచి ఇలాంటి అప్ డేట్ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఇలా రియాక్ట్ అయ్యారని చెప్పవచ్చు.